Saturday, May 4, 2024
- Advertisement -

ఎన్టీఆర్ ను ఇబ్బంది పెడుతున్న ” అది పురుష్ ” !

- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా మైథాలాజికల్ మూవీ “అది పురుష్ “. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ మూవీపై నేషనల్ వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. అయితే అమద్య రిలీజ్ అయిన టీజర్ వల్ల అంచనాలు అన్నీ ఒక్కసారిగా తారుమారయ్యాయి. టీజర్ లోని గ్రాఫిక్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవ్వడంతో ” అది పురుష్ ” టీమ్ మూవీ అవుట్ పుట్ పై పునః ఆలోచనలో పడింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేసింది. కానీ గ్రాఫిక్స్ పై విమర్శల కారణంగా బెటర్ అవుట్ పుట్ కోసం మూవీని వచ్చే ఏడాది జూన్ 16 కు వాయిదా వేశారు. .

దీంతో అది పురుష్ విడుదల పోస్ట్ పోన్ కారణంగా ఆ ప్రభావం పలు చిత్రాలపై పడే అవకాశం ఉంది. ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ” సలార్ ” వచ్చే ఏడాది సెప్టెంబర్ 28 రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రయూనిట్ గతంలోనే అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు అది పురుష్ వాయిదా పడడంతో సలార్ కూడా వాయిదా పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అదిపురుష్ ప్రభావం కేవలం ” సలార్ ” పైనే కాకుండా ఎన్టీఆర్ మూవీపై కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తన తదుపరి మూవీని ఎన్టీఆర్ తో చేయబోతున్నాడు. సాధారణంగా సలార్ అనుకున్న టైమ్ కి రిలీజ్ అయితే ఆ వెంటనే ఎన్టీఆర్ మూవీపైన కసరత్తు చేసేవాడు ప్రశాంత్ నీల్. కానీ అది పురుష్ వాయిదా కారణంగా సలార్ కూడా వాయిదా పడితే.. ఎన్టీఆర్ మూవీ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. మరి అది పురుష్ కారణంగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోతున్న రెండు బడా ప్రాజెక్ట్ ల ప్లానింగ్ అంతా తారుమారు అవుతున్నాయనే చెప్పొచ్చు.

ఇవి కూడా చదవండి

బింబిసారుడి గా రాంచరణ్ ?

మహేశ్ కంటే ముందే.. అల్లు అర్జున్ ?

వాల్తేరు వీరయ్య కోసం క్యూ కడుతున్న స్టార్ హీరోలు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -