Sunday, May 5, 2024
- Advertisement -

మొబైల్ పైన గీతాలు పడ్డాయా.. అయితే ఇలా చేయండి !

- Advertisement -

నేటి రోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడని వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఉదయం నిద్ర లేచినది మొదలుకొని రాత్రి పడుకునే వరకు దాదాపుగా అన్నీ పనులు ఒక్క స్మార్ట్ ఫోన్ ద్వారానే చేస్తూ ఉంటాం. ఇక స్మార్ట్ ఫోన్ మన రోజువారి జీవితంలో భాగమైనందున దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. మొబైల్ పైన ఎలాంటి గీతాలు పడకుండా స్క్రీన్ గార్డ్ లు, అలాగే మొబైల్ కింద పడితే డ్యామేజ్ అవ్వకుండా మొబైల్ బాక్ పౌచ్ లు వాడుతూ ఉంటాము. .

అయితే మనం ఎన్ని వాడిన కొన్ని సార్లు మొబైల్ డ్యామేజ్ కి గురి అవుతుంది. ముఖ్యంగా మనం ఎంత జాగ్రత్తగా ఉన్న మొబైల్ స్క్రీన్ పైన గీతాలు లేదా స్క్రాచ్ లు పడడం సహజం. అయితే మొబైల్ స్క్రీన్ పైన గీతాలు మరి ఎక్కువగా ఉంటే షాప్ కు వెళ్ళి స్క్రీన్ రీ ప్లేస్ చేసుకుంటూ ఉంటాము. దానికోసం మన దగ్గర ఉన్న డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయితే ఇంట్లోనే దొరికే కొన్నిటి ద్వారా మొబైల్ పైన ఉండే గీతాలను చెరిపేయవచ్చు లేదా క్లీన్ చేయవచ్చు. అదెలాగో చూద్దాం.

మన రోజువారీ దినచర్యలో వాడే టూత్ పేస్ట్ ద్వారా మొబైల్ పైన ఉన్న గీతాలను తోకగించవచ్చు. ముందుగా మొబైల్ స్క్రీన్ తడి కుడ్డతో శుభ్రం చేయాలి. ఆ తరువాత మొబైల్ పైన కొద్దిగా పేస్ట్ అప్లై చేసి. ఆ మెత్తటి పొడి గుడ్డ తీసుకొని ఆ పేస్ట్ ను మొబైల్ అంతా సున్నితంగా ఒక్క ఐదు నిముషాల పాటు రబ్ చేయాలి. అలా చేసిన తరువాత కాస్త తడిగా ఉన్న గుడ్డతో మొబైల్ పైన ఉన్న పేస్ట్ అంతా శుభ్రం చేయాలి. అలా చేసిన తరువాత మరొక మెత్తటి పొడి గుడ్డ తీసుకొని మొబైల్ ను పూర్తిగా క్లీన్ చేయాలి. ఇలా చేయడం వల్ల మొబైల్ స్క్రీన్ పైన ఉండే గీతాలను చాలావరకు చెరిపేయవచ్చు. అలాగే పేస్ట్ ప్లేస్ లో బేకింగ్ సోడా ఉపయోగించి కూడా మొబైల్ స్క్రీన్ పైన ఉండే స్క్రాచ్ లను తొలగించవచ్చు.

ఇవి కూడా చదవండి

మొబైల్ ఫ్యాంట్ జోబిలో పెడుతున్నారా.. జాగ్రత్త !

మీ మొబైల్ సూపర్ ఫాస్ట్ గా మారే.. అద్బుతమైన ట్రిక్ !

మొబైల్ స్పీకర్ లో దుమ్ము చేరితే.. ఇలా చేయండి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -