మరో ప్రయోగానికి సిద్ధమైన కమల్..!

- Advertisement -

విశ్వ నటుడు కమలహాసన్ ప్రయోగాలకు పెట్టింది పేరు. ఏ స్టార్ హీరో తమ కెరీర్ లో ఎన్ని ప్రయోగాలు చేశారంటే.. అవి వేళ్ళమీద లెక్కపెట్టొచ్చు. ప్రయోగం బెడిసి కొడితే మళ్ళీ వాటి జోలికి వెళ్లని హీరోలు ఎంతో మంది ఉన్నారు. కానీ కమలహాసన్ వీరందరికీ భిన్నం. ఆయన కెరీర్లో ప్రతి సినిమా ఒక ప్రయోగమే. ఆయన వేసినన్ని గెటప్ లు మరో నటుడు ఎవరు వేయలేదు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడు కమలహాసన్ మరో సారి ప్రయోగానికి సిద్ధం అవుతున్నాడు.

ప్రస్తుతం కమలహాసన్ యువ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విక్రమ్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కమల్ హాసన్ అంధుడిగా కనిపించనున్నట్లు సమాచారం. కమలహాసన్ ఇదివరకే ఓ సినిమాలో అంధుడిగా నటించారు. 1981 లో విడుదలైన రాజ్ పారవై అనే సినిమాలో అంధుడిగా నటించి మెప్పించాడు. దాదాపు నలభై ఏళ్ళ తర్వాత మళ్లీ కమలహాసన్ అంధుడిగా నటించబోతున్నారు. ఈ సినిమాలో సగభాగం వరకూ కమల్ అంధుడిగా కనిపిస్తారని సమాచారం.

- Advertisement -

కాగా విక్రమ్ సినిమా ను కమలహాసన్ తన సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై ఆర్. మహేంద్రన్ తో కలిసి నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కేజీఎఫ్ కు ఫైట్స్ కంపోజ్ చేసిన స్టంట్ మాస్టర్స్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. కమలహాసన్ చాలా ఏళ్ళ తర్వాత మళ్లీ పోలీస్ అధికారిగా నటిస్తున్నారు.

Also Read

నోట్లదండలతో వనితా విజయ్​కుమార్​ .. నెట్టింట్లో పిక్స్​ వైరల్​

దసరా కాదు.. అంతకంటే ముందే అఖండ..!

ప్రభాస్ కొత్త సినిమా అప్డేట్ వచ్చేది అప్పుడే..!

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -