బాహుబలిని వెనకేసిన రాకీ బాయ్..!

- Advertisement -

దక్షిణాదిలో భారీ సినిమాలు అంటే మామూలుగా చూసేది కోలీవుడ్, టాలీవుడ్ వైపే. ఇక మలయాళంలో ఎక్కువగా ప్రయోగాత్మక చిత్రాలు వస్తుంటాయి. ఇక కన్నడ చిత్రసీమ సౌత్లో అన్నిటికంటే వెనుకబడింది. అయితే కేజీఎఫ్ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమకు ఒక్కసారిగా ఊపు తెచ్చింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ ఒక్క కన్నడ చిత్ర సీమే కాదు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది.

కేజీఎఫ్ సినిమా హిట్ కావడంతో ఇప్పుడు కన్నడనాట కూడా భారీ సినిమాలు రూపొందుతున్నాయి. కాగా కేజీఎఫ్ సినిమాకు సీక్వెల్ గా కేజీఎఫ్ -2 కూడా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా జూలై 16 వ తేదీ విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా ఆగిపోయింది. కాగా ఈ సినిమా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది.

- Advertisement -

కేజీఎఫ్ చాఫ్టర్ 2 టీజర్ సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలో మరే సినిమాకు రాని విధంగా ఈ మూవీకి 200 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీంతోపాటు ఈ సినిమా టీజర్ కు 8.4 మిలియన్ లైక్స్, 1.1 మిలియన్ కు పైగా కామెంట్స్, 1 బిలియన్ ఇంప్రెషెన్స్ తో సరికొత్త రికార్డు సృష్టించింది. టీజర్ వ్యూస్ పరంగా ఇప్పటివరకు బాహుబలి 2పేరిట రికార్డు ఉండేది. ఆ సినిమా టీజర్ 120 వ్యూస్ సాధించింది. ఆ రికార్డు ను కేజీఎఫ్ -2 చెరిపేసింది. తెలుగులో బాహుబలి 2 తర్వాత అల్లు అర్జున్ పుష్ప టీజర్ 77 మిలియన్ల వ్యూస్ సాధించింది.

Also Read

నోట్లదండలతో వనితా విజయ్​కుమార్​ .. నెట్టింట్లో పిక్స్​ వైరల్​

ఆర్​ఆర్​ఆర్​ మ్యూజిక్​ అరుపులేనా..!

తాజా రాజకీయాలపై ‘ఆచార్య’ లో పంచ్​లు

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -