Saturday, April 27, 2024
- Advertisement -

కార్తికేయ రొమాంటిక్ ఎంటర్టైనర్.. హీరోయిన్ ఎవరో తెలుసా..!

- Advertisement -

ప్రేమతో మీ కార్తీక్ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై ఆర్ఎక్స్ 100 తో సూపర్ హిట్ అందుకున్నాడు యువ హీరో కార్తికేయ. ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత తెలుగులో అతడికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి. కార్తికేయ ఒక్క హీరో పాత్రలకే పరిమితం కావడం లేదు విలన్ గా కూడా సినిమాలు చేస్తున్నాడు. నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా లో కార్తికేయ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు కోలీవుడ్లో స్టార్ హీరో అజిత్ నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వలిమై లో విలన్ గా కార్తికేయ నటిస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ గా కార్తికేయ నటించడం విశేషమే. ఈ సినిమాతో పాటు కార్తికేయ మరో సినిమాను లైన్ లో పెట్టాడు. చావు కబురు చల్లగా సినిమా తో ప్రయోగం చేసిన కార్తికేయకు పరాజయం ఎదురుకావడంతో ఈసారి అతడు రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను ఎంచుకున్నాడు.

యువీ క్రియేషన్స్ చిన్న హీరోలతో సినిమాలు చేసేందుకు యూవీ కాన్సెప్ట్స్ అనే బ్యానర్ స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ బ్యానర్ పై కార్తికేయ హీరోగా సినిమా చేయనున్నారు. ఈ సినిమాతో ప్రశాంత్ అనే నూతన దర్శకుడు పరిచయం కానున్నాడు. ఇందులో హీరోయిన్ గా చిలసౌ ఫేమ్ రుహనీ శర్మ ఎంపిక అయినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన అతి త్వరలోనే రానుంది.

Also Read

మరో ప్రయోగానికి సిద్ధమైన కమల్..!

అల్లూ ఫ్యాన్స్.. వెయిటింగ్ అక్కర్లేదు.. పుష్పరాజ్ వచ్చేది ఈ ఏడాదే..!

పాపం సిద్ధార్థ్.. హీరోల వయసు టాపిక్ వస్తే చాలు.. వెళ్ళనీ అతడి వైపే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -