యుట్యూబ్ ను షేక్ చేస్తున్న అఖండ ట్రైలర్

- Advertisement -

బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ సినిమా ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. విడుదలయి 24 గంటలు గడవకముందే 10 మిలియన్ వ్యూస్ ను ఈ చిత్రం ట్రైలర్ రాబట్టుకుంది. ప్యాన్ ఇండియా సినిమాలకు తీసిపొని విజువల్స్ ,తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ,బాలకృష్ణ , శ్రీకాంత్ గెటప్స్. పవర్ ఫుల్ డైలాగ్స్ ఇవన్ని కూడా ఇన్స్టెంట్గా సినిమా ట్రైలర్ విజయానికి ప్రధానమైన కారణాలుగా నిలిచాయి. బాలకృష్ణ , బోయపాటి కాంబోలో ఇంతకు ముందు వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలను మించి అఖండ ఔట్పుట్ విషయంలో బోయపాటి క్వాలిటీ ని రాబట్టారు.

అఖండ టీమ్ నుంచి వచ్చిన ప్రతి ప్రచార చిత్రం , అభిమానుల అంచనాలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. సాధారణంగా బాలయ్య సినిమా హిట్ అవ్వద్దు . అయితే మాత్రం మిగతా సినిమాలకు ఇబ్బందే. గతంలో బాలకృష్ణ నటించిన సింహా , లెజెండ్ సినిమా విషయంలో బ్లాక్బస్టర్ టాక్ వచ్చిన తర్వాత మిగతా సినిమాల మీద ఎఫెక్ట్ ని గట్టిగా పడింది. వాటికి సరైన కలెక్షన్లు కూడా రాలేదు ఈసారి అఖండ విషయంలో కూడా అదే రేంజ్ సక్సెస్ ను అభిమానులు ఆశిస్తున్నారు. బాలకృష్ణ మళ్లీ సక్సెస్ ట్రాక్లోకి రావాలని, అలా తీసుకురాగల సత్తా బోయపాటి దగ్గరే ఉంది అని నమ్ముతున్నారు. ఇవన్నీ క్లారిటి రావాలంటే డిసెంబరు 2 వరకు ఆగాల్సిందే..!!

- Advertisement -

సినిమా హిట్టే .. కలెక్షన్ నిల్..

సూపర్ హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

టాలీవుడ్ లో నెక్ట్స్ విడాకులు వారిదేనట..!

అల్లు వారు ఎంత‌కాలం మెగా ప‌ల్ల‌కీ మోయాలి..

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -