సినిమా హిట్టే .. కలెక్షన్ నిల్..

- Advertisement -

ఈ ఏడాది క్రాక్ , ఉప్పెన, జాతి రత్నాలు లాంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత ఆ స్దాయిలో వసూళ్లు అందుకున్న సినిమాలేవి అంటే వేళ్ల మీద లెక్కొటోచ్చు.. వకీల్ సాబ్ లాంటి సినిమా కూడా కొన్ని ఏరియాల్లో నష్టాలను మిగిల్చింది. దసరా కు ముందు వచ్చిన లవ్ స్టోరీ , వెనుక వచ్చిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాల పరిస్దితి ఇంచుమించు అంతే.. మిగతా సినిమాలన్నీ కూడా , టాక్ పాజిటివ్ గా ఉన్నా, రెండో రోజు నుంచి వసూలు చేయటంలో వెనకపడ్డాయి.

వరుడు కావలెను , రొమాంటిక్, పుష్పక విమానం లాంటి మీడియం బడ్జెట్ సినిమాలకు హిట్ టాక్ వచ్చినా , అవి బ్రేక్ ఈవెన్ అవుతాయన్న నమ్మకం లేదు. ఈ దశలో డిసెంబరు నుంచి అఖండ , పుష్ప, గని, లాంటి భారీ బడ్జెట్ సినిమాలు వచ్చి ఎంతవరకు కలెక్షన్స్ ను అందుకుంటాయన్నదే అసలైన ప్రశ్న. అఖండ పాటలకు లుక్ లకు రెస్పాన్స్ బానే ఉంది. దానికి తగ్గటుగానే , ఈ సినిమా బిజినెస్ కూడా గట్టిగానే అయింది. ఎపి తెలంగాణ లోనె నలభై కోట్లకు పైగా బిజినెస్ అయితే అయింది కానీ , అవి ఎంతవరకు తిరిగివస్తాయి.?

పుష్ప సినిమా అయితే పాన్ ఇండియా మూవీగా ఎనౌన్స్ చెశారు కానీ, తీరా హిందీ లో విడుదల కాదని అంటున్నారు. గని ,శ్యామ్ సింగారాయ్ సినిమాలకు బిజినెస్ విషయంలో క్లారిటీ రావల్సి ఉంది. కేవలం ఆర్.ఆర్.ఆర్ మినహా రాథా శ్యామ్ లాంటి బడా సినిమాల మీద కూడా ఆడియెన్స్ కు అంతగా ఇంట్రెస్ట్ లేదనట్టుగా ఉంది‌ .‌ అందుకే నిర్మాతకు హీరోలకు తమ సినిమాలకు టాక్ పాజిటివ్ గా వచ్చినా , వసూళ్లు వస్తాయా..? అన్న అనుమానం ఇంకా అలానే ఉంది..

నాని సినిమాకు బిజినెస్ కష్టాలు..

సూపర్ హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

ప్రతీసారి ప్రకాష్ రాజే ఎందుకు టార్గెట్ అవుతాడు..?

జగన్ పై ఉద్యోగుల పోరాటమా..

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -