Saturday, April 20, 2024
- Advertisement -

ఊటీలో కింగ్ నాగార్జున..

- Advertisement -

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దరకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ది ఘోస్ట్’ పై భారీ అంచనాలు వున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో హీరోలను మునుపెన్నడూ చూడని పాత్రల్లో ప్రజెంట్ చేయడంలో పేరుపొందిన ప్రవీణ్ సత్తారు, కింగ్ నాగార్జునని విభిన్నమైన పాత్రలో చూపించి ప్రేక్షకులని థ్రిల్ చేయడానికి వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

చిత్ర యూనిట్ ఇటీవల దుబాయ్‌లో సుదీర్ఘ షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో కథానాయికగా సోనాల్ చౌహాన్ నటిస్తోంది . ఈ చిత్రంలో నాగార్జున, సోనాల్ చౌహాన్ ఇద్దరూ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపించనున్నారు.

తాజాగా ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఊటీలో ప్రారంభమైయింది .“ఊటీలో ఉదయాలు ఎప్పుడూ అద్భుతంగా ఉంటాయి” అని ట్వీట్ చేస్తూ దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఊటీ లొకేషన్ స్టిల్ ని అభిమానులతో పంచుకున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోహిస్తున్నారు.

ఐటమ్ సాంగ్ కోసం రష్మిక ఎంత డిమాండ్ చేస్తోందో తెలుసా?

ఆర్ఆర్ఆర్ తరహాలో ప్లాన్ చేస్తున్న బన్నీ

బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పిన లైగర్ భామ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -