మొన్నటి వరకు అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు అక్కినేని నాగచైతన్య సమంతతో ప్రేమ వ్యవహారం నడుపుతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంలో ఇంక క్లారిటీ రాలేదు కాని అక్కినేని అఖిల్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. ఇటివలే ఓ పత్రికకు ఇచ్చిన ఇటర్వ్యూలో తను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు చేప్పిన విషయం తెలిసిందే.
త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడట. అయితే ఈ విషయంపై తన ఫ్యామిలీతో మాట్లాడి పెళ్లి చేసుకోవాలి అని భావిస్తున్నాడట అఖిల్. నాగ్ కూడా ఈ విషయంపై పాజిటివ్ గానే ఉన్నాడట. అయితే ఇప్పుడు అఖిల్ లవ్ చేస్తున్న అమ్మాయి ఎవరా? అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అఖిల్ మాత్రం ఆ అమ్మాయి ఎవరు అని చెప్పడం లేదు.
అయితే అఖిల్ చెప్పనప్పటికి ఆ అమ్మాయి పేరు బయటకు లీక్ అయ్యింది. ఆమె ఎవరో కాదు ప్రముఖ వ్యాపరవేత జీవీకే సంస్థల అధినేత జీవీకే రెడ్డి మనవరాలు శ్రియా భూపాల్. ప్రస్తుతం ఇమె న్యూయర్క్ లో ఫ్యాషన్ డిజైనర్ నెర్చుకుంటుంది. అక్కినేని అఖిల్ కూడా జీవీకే కుటుంబానికి భాగా నచ్చాడట. శ్రియా భూపాల్ డస్కీ స్కిన్ తో, మంచి హైట్ తో అందంగా ఉంది. ఇక చైతూ, సమంత లతో పాటు అఖిల్, శ్రియా ల పెళ్లి జరగబోతుందంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
Related