Friday, April 26, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్ : అలియాభట్ కు కళ్లు చెదిరే రెమ్యునరేషన్..!

- Advertisement -

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమాను నిర్మాత దానయ్య రూ.350 నుంచి 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా నటిస్తున్న అలియా భట్ కు కళ్ళు చెదిరే రెమ్యునరేషన్ ఇస్తున్నారట. నిజానికి ఆర్ఆర్ఆర్ లో అలియా భట్ పాత్రకు ఉన్న స్కోప్ తక్కువే. ఈ సినిమాలో ఆమె సీత పాత్రలో నటిస్తున్నారు.

అయితే అలియా భట్ స్కోప్ తక్కువ అయినప్పటికీ ఆమె పాత్ర సినిమాలో కీలకమైందని గతంలో విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. కాగా ఈ సినిమాలో నటించేందుకు అలియాభట్ రూ.6కోట్లు తీసుకుంటోందట. నిజానికి ఈ సినిమాకు ఆమె కేటాయించిన డేట్స్ తక్కువే. అయినప్పటికీ రూ.6కోట్లు అందజేయడమంటే ఇది షాకింగ్ రెమ్యూనరేషనే.అలియా భట్ మాత్రమే కాదు ఈ సినిమాలో నటిస్తున్న బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా భారీ మొత్తంలో అందుకోనున్నాడు. 30 నిమిషాల నిడివి ఉన్న పాత్రలో నటిస్తున్న అజయ్ రూ.25 కోట్ల పారితోషికం అందుకుంటున్నా రట.

Also Read: హీరో చేంజ్.. మహేష్ కథలోకి పవన్..!

ఇక ఈ సినిమాలో హీరోలుగా నటిస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ రూ. 35 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న రాజమౌళి ఎంత మొత్తంలో తీసుకుంటున్నది అనే విషయమై క్లారిటీ లేదు. బాహుబలి సినిమా టైంలో ముందు కొంత మొత్తంలో పారితోషికం తీసుకున్న రాజమౌళి, సినిమా విడుదలయ్యాక లాభాల్లో కొంతమేర వాటా తీసుకున్నట్టు సమాచారం.

Also Read: సమకాలిన స్టార్ హీరోల సమరం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -