Sunday, May 5, 2024
- Advertisement -

ఈటల రాజేందర్‌ రాజీనామా ఆమోదం

- Advertisement -

మాజీ మంత్రి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామాను అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించారు. మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఈ ఉదయం తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను స్పీకర్‌ కార్యాలయంలో సమర్పించారు. నేడు అమరవీరులకు నివాళులు అర్పించిన ఈటల స్పీకర్ ఫార్మాట్ లో రూపొందించిన తన రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శికి అందించారు. ఆ రాజీనామా పత్రాన్ని పరిశీలించిన స్పీకర్ పోచారం ఆమోద ముద్ర వేశారు.

కాగా, భూకబ్జా ఆరోపణలతో ఈటలను మంత్రి పదవినుంచి ప్రభుత్వం బర్తరఫ్‌ చేసిన సంగతి తెలిసిందే. బర్తరఫ్‌ చేయడంతో టీఆర్‌ఎస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేశారు. మాసాయిపేట, దేవరయాంజల్‌, రావల్‌కోల్‌లో అసైన్డ్‌ భూములు, దేవాదాయ భూములను ఆక్రమించుకున్నట్లుగా ఈటలపై ఆరోపణలు. అందిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపం చెందిన ఈటల బీజేపీలో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 14న ఆయన బీజేపీలో చేరనున్నారు. 2018 అసెంబ్లీ ఎలక్షల్లో హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి ఈటల ఎమ్మెల్యగా ఎన్నికయ్యారు. ఈ సాయంత్రం ఈటల ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన వెంట రమేశ్ రాథోడ్, ఏనుగు రవీందర్ రెడ్డి వంటి నేతలు కూడా హస్తిన వెళ్లి బీజేపీలో చేరతారని తెలుస్తోంది.

రామ్ సినిమాలో విలన్ గానా.. ఆ వార్తల్లో నిజం లేదన్న తమిళ స్టార్ హీరో..!

కరోనాతో ప్రముఖ కన్నడ నటుడు సురేష్ చంద్ర కన్నుమూత

ఏపీలో పరీక్షలు ఉంటాయా? ఉండవా? మంత్రి క్లారిటీ..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -