Thursday, May 2, 2024
- Advertisement -

చలికాలంలో జుట్టు సమస్యలకు చెక్ పెట్టండిలా !

- Advertisement -

చలికాలంలో ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. చర్మం పొడి బారడం, తరచూ జలుబు బారిన పడడం, అప్పుడప్పుడు జ్వరం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తడం సహజం. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు వైద్యుడిని సంప్రదిస్తూ ఉంటాము. అయితే ఈ ఆరోగ్య సమస్యలు మాత్రమే కాకుండా జుట్టుకు సంబంధించిన సమస్యలు కూడా ఈ చలికాలంలో వేదిస్తూ ఉంటాయి. జుట్టు పొడిబారడం, అధికంగా జుట్టు రాలిపోవడం వంటి సమస్యలు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే ముఖ్యంగా జుట్టుకు సంబంధించిన సమస్యలకు కొన్ని ఇంటి చిట్కాల ద్వారా చెక్ పెట్టవచ్చు. అవేంటో చూద్దాం !

శీతాకాలంలో జుట్టుకు సంబంధించిన సమస్యలను నివారించేందుకు గంజి చాలా ఉపయోగ పడుతుంది. గంజిలో ఉండే ఇనోసిటోల్ అనే కార్బోహైడ్రేట్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. గంజికి కాసింత మజ్జిగ జోడించి తలకు అప్లై చేసి ఆ తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లకు సరైన పోషకాలు అందుతాయి. దాంతో జుట్టు కుదుళ్ల నుంచి స్ట్రాంగ్ గా తయారవుతుంది. అంతే కాకుండా సిల్కీ గా ఎంతో ఆకర్షణీయంగా మారుతుంది. ఒకవేళ జుట్టు అధికంగా బిరుసుగా ఉన్నవారు గంజితో పాటు కాసింత నిమ్మరసం కూడా యాడ్ చేసి ఒక చెంచాడు పెరుగు కలిపిన మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల వరకు అప్లై చేయాలి. ఆ తరువాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.

బియ్యం కడిగిన నీటిలో కలబంద గుజ్జు, మరియు నిమ్మరసం యాడ్ చేసి జుట్టుకు అప్లై చేసి ఒక అరగంట తరువాత స్నానం చేయడం వల్ల కూడా జుట్టు కు సంబంధించిన చాలా సమస్యలు అరికట్టవచ్చని కొందరు చెబుతున్నారు. ఇంకా గంజి తోపాటు గుడ్డులోని తెల్లసొన, కొబ్బరి పాలు మిశ్రమం కూడా జట్టుకు చాలానే మేలు చేస్తుందట. ఇక స్నానం చేసేటప్పుడు సహజ పద్దతిలో కుంటుడు కాయ షాంపు వాడడం వల్ల జుట్టుకు సంబంధించిన చాలా సమస్యలను అరికట్టవచ్చని కొందరు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

రాత్రిపూట వెల్లుల్లి తింటే.. ఎమౌతుందో తెలిసా ?

వింటర్ లో చర్మం పొడిబారుతోందా.. ఇలా చేయండి !

చలికాలంలో జలుబు కు చెక్ పెట్టాలంటే ఇలా చేయండి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -