Friday, May 10, 2024
- Advertisement -

మరో 30 ఏళ్ళు మనమే.. జగన్ కాన్ఫిడెన్సా ? ఓవర్ కాన్ఫిడెన్సా ?

- Advertisement -

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ నేతలకు చేస్తోన్న దిశానిర్దేశం ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో విజయం మనదేనని, కానీ మన టార్గెట్ విజయం కాదని 175 స్థానాల్లో విజయం సాధించడమే మన టార్గెట్ అంటూ జగన్ ఇప్పటికే పదే పదే వైసీపీ నేతలకు సూచిస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క నేత నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం నుంచి పొందుతున్న లభ్ది గురించి వివరించాలని జగన్ సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో గడపగడపకు మన ప్రభుత్వం పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమం ద్వారా ప్రజా అభిప్రాయాలను సేకరించే పనిలో ఉంది జగన్ సర్కార్.

ఇదిలా ఉంచితే మరోసారి తన ఫ్యూచర్ ప్రణాళిక స్పష్టం చేశారు వైఎస్ జగన్… ఇటీవల విశాఖ నార్త్ నియోజికవర్గ కార్యకర్తలతో భేటీ అయిన ఆయన పార్టీలోని పరిస్థితులపై, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపుపై,. దిశ నిర్దేశం చేశారు. ” వివక్షకు ఏమాత్రం తవివ్వకుండా.. లంచాలకు ఆస్కారం లేకుండా అవినీతి రహిత పాలన జరుగుతోందని, అదే మనకు వచ్చే ఎన్నికల్లో శ్రీరామ రక్షా అని జగన్ చెప్పుకొచ్చారు. ప్రజలకు మన ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉందని, వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయం సాధించడం కష్టమేమీ కాదని సి‌ఎం జగన్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో గెలిస్తే మరో 30 ఏళ్ల వరకు మనమే ఉంటాం ” అంటూ జగన్ ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉండడంతో ప్రతి ఒక్క నేత కష్టపడి పని చేయాలని సూచించారు జగన్.

మరి జగన్ ఆశిస్తున్నట్లుగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 సీట్లు సాందించగలదా ? మరో 30 ఏళ్ళు పాలన మనదే అనడానికి జగన్ ధీమా ఏంటి ? జగన్ కు ఉన్నది కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెనా ? అనే ప్రశ్నలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజల్లో అనుకూలత ఏ స్థాయిలో ఉందో వ్యతిరేకత కూడా అంతే స్థాయిలో ఉందనేది కాదనలేని వాస్తవం. ఈ నేపథ్యంలో గెలుపు విషయం పక్కన పెడితే గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి భారీగా సీట్లు తగ్గనున్నాయని ఇప్పటికే ఆయా సర్వేలు చెబుతున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే విషయం ” గడప గడపకు మన ప్రభుత్వం ” ద్వారా వైసీపీ నేతలకు కూడా బాగానే తెలుసు. దాంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుగు కూడా కష్టమే అనే వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. మరి జగన్ ఏ కాన్ఫిడెన్స్ తో 175 స్థానాలు టార్గెట్ గా ఉన్నారు అనేది ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న. ఇక మరో 30 ఏళ్ళు అధికారం మనదే అని చెప్పడంలో జగన్ నిరంకుశ అధికారం దాహం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని కొందరు రాజకీయ వాదులు అభిప్రాయం. మరి జగన్ వచ్చే ఎన్నికలే టార్గెట్ గా జగన్ నిర్దేశించుకున్న లక్ష్యాలు కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా అనేది కాలమే సమాధానం చెప్పాలి.

ఇవి కూడా చదవండి

ఛలో కర్నూల్.. బాబు వ్యూహం ఫలిస్తుందా ?

జగన్ పార్టీ పై బీజేపీ కుట్ర ?

ఈటెలపై మళ్ళీ కే‌సి‌ఆర్ ఫోకస్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -