స్టార్ హీరో కొడుకుగా విజయ్ దేవరకొండ ?

Mohanlal, Vijay Deverakonda to team up as father and son in period action-drama Vrushabha?
Mohanlal, Vijay Deverakonda to team up as father and son in period action-drama Vrushabha?

రౌడీ హీరో విజయ్ దేవరకొండకు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తన మూడవ సినిమా ” అర్జున్ రెడ్డి ” తోనే ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. ఆ తరువాత వచ్చిన గీతగోవిందంతో యూత్ లో తిరుగులేని ఫాలోయింగ్ సంపాధించుకున్నాడు. అయితే కేవలం సినిమాలే కాకుండా తన డిఫరెంట్ ఆటిట్యూడ్ వల్ల కూడా విజయ్ ఇమేజ్ డబుల్ అయిందనే చెప్పాలి. దాంతో గీత గోవిందం తరువాత వచ్చిన సినిమాలేవి.. పెద్దగా విజయం సాధించనప్పటికి.. తన క్రేజ్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇక ఈ ఏడాది లైగర్ తో బాక్సాఫీస్ ముందుకు వవ్ఛిన విజయ్.. ఈ మూవీ కూడా చేధు అనుభవాన్నే మిగిల్చింది. ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవాలని ఆరాట పడినప్పటికి విజయ్ ఆశలు ఏమాత్రం ఫలించలేదు.

అయినప్పటికి ప్రస్తుతం విజయ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ తరువాత గౌతమ్ తిన్ననూరి, పరశురామ్ వంటి దర్శకులు లైన్లో ఉన్నారు. ఇక ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. విజయ్ తాజాగా ఒక మలయాళ మూవీకి కమిట్ అయ్యాడట. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ త్వరలో ” వృషభ ” అనే భారీ పీరియాడిక్ మూవీని ప్లాన్ చేస్తున్నట్లు మలయాళ ఫిల్మ్ సర్కిల్ నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ మూవీలో మోహన్ లాల్ కొడుకుగా ఓ కీలక పాత్ర కోసం విజయ్ దేవరకొండతో సంప్రదింపులు జరుగుతున్నారట. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ మూవీని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించాలని చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోందట. మరి ఈ ప్రాజెక్ట్ కు విజయ్ ఒకే చెబుతారా ? లేదా అనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురుచూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

నాగ్, వెంకీ మూవీస్ కి బ్రేక్ ?

ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా.. శంకర్ మూవీ ?

చిరు బాలయ్య కు.. తలపతి విజయ్ ఎఫెక్ట్ ?