Friday, May 17, 2024
- Advertisement -

పవన్ హత్యకు కుట్ర జరుగుతోందా.. వాస్తవమెంత ?

- Advertisement -

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై హత్యకు కుట్ర జరుగుతోందా ? ప్రస్తుత ఇదే ప్రశ్న ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. పవన్ నివాసం వద్ద రిక్కి నిర్వహించారని, జనసేన కార్యలయం వద్ద కూడా కొందరు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తున్నారని, స్వయంగా జనసేన పార్టీ వ్యవహారాల ఇంచార్జీ నాదెండ్ల మనోహర్ చెప్పడంతో ఈ వార్తా ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా విశాఖ ఘటన తరువాత పవన్ పై కుట్ర చేస్తున్నారని నాదెండ్ల చెప్పుకొచ్చారు. అంతే కాకుండా పవన్ ను అంతమొందించడానికి వందల కోట్లు సుఫరీ చేతులు మారినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు.

ఇక ఈ మద్యకాలంలో ప్రాణహానికి సంబంధించిన వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. 2019 ఎన్నికల ముందు జగన్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నారని అందులో భాగంగా కోడికత్తి వివాదం ఏ స్థాయిలో సంచలనం అయిందో అందరికీ తెలిసిందే. ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ నేతలలో కొందరు తరచూ తమకు ప్రాణహాని ఉందంటూ వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఆ మద్య పట్టాభి రామ్, తాజాగా అయ్యన్నపాత్రుడు వంటి వారు తమకు ప్రాణహాని ఉందంటూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇలా రాజకీయ నేతలు చేస్తున్న ఈ ” ప్రాణహాని ” ఆరోపణలు.. జస్ట్ ఆరోపణలుగానే మిగిలిపోతున్నాయి తప్పా.. ఎవరు కుట్ర చేస్తున్నారు అనే దానిపై ఎలాంటి సమాచారం ఉండకపోవడం గమనార్హం.

దీన్ని బట్టి చూస్తే నేటి సమకాలీన రాజకీయాల్లో ” ప్రాణహాని ” కి సంబంధించిన ఆరోపణలు సర్వసాధారణం అయిపోయాయి. సానుభూతి కోసమో లేదా ప్రజల అటెంక్షన్ గ్రాఫ్ చేయడానికో పోలిటికల్ లీడర్స్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని కొందరు రాజకీయవాదులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అలాగని ఇలాంటి ” ప్రాణహాని ” వ్యాఖ్యలను తేలిగ్గా తీసుకోవడానికి కూడా వీల్లేదు. ఏది ఏమైనప్పటికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారనే వార్తలు మాత్రం ఇప్పుడు రెండు తెలుగురాష్ట్రాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవముందో తెలియాల్సివుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -