Saturday, April 20, 2024
- Advertisement -

పుష్ప సినిమా షూటింగ్ పై ఇంకా వీడని సందేహం..

- Advertisement -

పుష్ప సినిమా షూటింగ్ పై ఇంకా అయోమయం కొనసాగుతూనే ఉంది. ఇదిగో షూటింగ్ మొదలవుతుంది అదిగో అప్పుడు షూటింగ్ మొదలవుతుందని చెప్తూనే ఉన్నారు తప్పా ఈ సినిమా షూటింగ్ ఇంకా మొదలుకాలేదు..  ఇటీవలే కేరళ అడవుల్లో షూటింగ్ కి చిత్ర షూటింగ్ జరుపుకుంటుంది అనుకున్నారు కానీ ఆ సినిమా షూటింగ్ ఇప్పటికీ మొదలు కాకపోవడం తో కథ మళ్ళీ మొదటికి వచ్చిందా అని అభిమానులు అంటున్నారు.. ఎందుకో ఈ సినిమా మొదలైనప్పటినుంచి అన్నీ నెగెటివ్ షేడ్స్ రావడం కూడా పుష్ప కి పెద్ద మైనస్ అని చెప్పాలి..

ఈ సినిమాకు అడవుల బ్యాక్ డ్రాప్ కావాలని, అక్కడే కిందా మీదా అవుతున్నారని తెలిసిందే. ఆరంభంలో అంటే కరోనాకు ముందు కేరళ అనుకున్నారు. తీరా కేరళలో కరోనా ప్రారంభం కాగానే ఆంధ్రలో మారేడుమిల్లి, రంప చోడవరం అనుకున్నారు. తీరా చేస్తే ఆంధ్రకు కూడా కరోనా వచ్చింది. దాంతో ఆగిపోయింది. కరోనా తగ్గాక వికారాబాద్ అడవుల పేరు వినిపించింది. కానీ ఇన్నాళ్లు ఆగాం కదా, కేరళకే వెళ్దాం అన్న టాక్ వచ్చింది. కానీ ఇఫ్పుడు ఫైనల్ గా మళ్లీ రంపచోడవరం, మారేడుమిల్లికే వెళ్తోంది యూనిట్.

నవంబర్ నుంచి అక్కడ షూట్ ప్రారంభించి, ఆ తరువాత కేరళకు వెళ్తారని తెలుస్తోంది. ఈ మేరకు షెడ్యూళ్లు, ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి రష్మిక మందాన హీరోయిన్ గా ఎంపిక కాగా దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా కి సంగీతం సమకూరుస్తున్నారు.. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా ని నిర్మిస్తుంది..

అల్లు అర్జున్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా ?

త్రివిక్రమ్ వల్ల మహేష్ , చరణ్ ల మధ్య గ్యాప్ పెరగనుందా..?

35 ఏళ్లు దాటిన ఇంకా పెళ్లి చేసుకోని హీరోయిన్స్ వీరే..!

సంగీత దర్శకుల రెమ్యునరేషన్స్ ఇలా ఉంటాయి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -