Wednesday, April 17, 2024
- Advertisement -

స్టైలిష్ స్టార్ ఊరమాస్ లుక్!

- Advertisement -

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న మొదట బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ పుష్ప. ఈ మూవీ కోసం ఆడియెన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటి వరకు బన్ని పాన్ ఇండియా మూవీలో నటించలేదు.. ఇదే మొదటి సారి కావడంతో భారీ అంచనాలె నెలకొన్నాయి. ఇటీవల సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా తప్పకుండా ఈ ఎడాది ఆగస్టు 13న రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు.

ఇక తక్కువ సమయం ఉండడంతో దర్శకుడు సుకుమార్ అయితే స్పీడ్ పెంచినట్లు క్లారిటీగా అర్ధమయ్యింది. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తోన్న తాజా చిత్రం పుష్ప నుండి లేటెస్ట్ గా పిక్ రిలీజైంది. ఈ ఫొటోలో మాస్ గెటప్ లో కనిపిస్తున్న స్టయిలిష్ స్టార్.. ఫ్యాన్స్ తో ఊరమాస్ అనిపిస్తున్నాడు. డైరెక్టర్ సుకుమార్ సరికొత్త బన్నీని పరిచయం చేయబోతున్నాడని అనిపిస్తోంది.

రింగుల జుట్టుతో.. మాసిన గడ్డంతో.. పాత తరం ఉపయోగించే స్వెట్టర్ ధరించిన బన్నీ లుక్ కేక పెట్టిస్తోంది. ఇంతకు ముందెన్నడూ చూడని బన్నీ స్టయిల్ ను పరిచయం చేస్తోంది. రూ.180 కోట్ల భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ.. ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా బన్నీ ఊరమాస్ లుక్ చూసి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

ఎంపీ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం..‌!

అక్కడ రక్తం వర్షం చూసి గుండె గుభేల్ అంది..!

పంత్‌ను అంటున్నారు స‌రే.. మ‌రి వాళ్ల సంగతేంటి?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -