Tuesday, April 30, 2024
- Advertisement -

పంత్‌ను అంటున్నారు స‌రే.. మ‌రి వాళ్ల సంగతేంటి?

- Advertisement -

రిష‌భ్ పంత్‌.. టీమిండియా వికెట్ కీప‌ర్ బ్యాట్్స‌మెన్‌.. ఒక్క‌సారి క్రీజులో పాతుకుపోతే ప‌రుగుల వ‌ర‌ద పారిస్తాడు. కానీ అదే స్థాయిలో నిర్ల‌క్ష్య‌పు షాట్ల‌‌తో వికెట్ కోల్పోయిన ఘ‌ట‌న‌లు గ‌తంలో అనేకం ఉన్నాయి. దీంతో అత‌డిని పొగిడిన వాళ్లే విమ‌ర్శ‌లు గుప్పించారు కూడా. అయితే, ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో త‌న‌ను తాను మ‌రోసారి నిరూపించుకున్నాడు ఈ యువ ఆట‌గాడు. ముఖ్యంగా సిడ్నీ టెస్టులో 97 ప‌రుగుల‌తో రాణించాడు.

ఇక బ్రిస్బేన్ టెస్టు సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. 89 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచి చిర‌స్మ‌ర‌ణీయ టెస్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించి ప్ర‌శంస‌లు అందుకున్నాడు. త‌న విలువేంటో సాటి చెప్పాడు. ఈ క్ర‌మంలో ఇంగ్లండ్‌తో స్వ‌దేశంలో జ‌రుగుతున్న టెస్టు సిరీస్‌కు ఎంపిక‌య్యాడు పంత్‌. అంద‌రూ ఊహించిన‌ట్టుగానే తుది జ‌ట్టులో చోటు ద‌క్కించుకున్నాడు. అంతేకాదు చెన్నైలో జ‌రుగుతున్న తొలి టెస్టులో దూకుడుగా ఆడి జ‌ట్టు గౌర‌వ‌ప్ర‌ద‌మైన స్కోరు చేయ‌డంతో కీల‌క పాత్ర పోషించాడు.

టీ20 త‌ర‌హాలో రెచ్చిపోతూ 88 బంతుల్లోనే 91 ప‌రుగులు చేసి వ‌హ్వా అనిపించాడు. 9 ఫోర్లు, 5 సిక్సర్లతో ఆక‌ట్టుకున్నాడు. అయితే, ఇక్క‌డ కూడా సిడ్నీ, బ్రిస్బేన్ త‌ర‌హాలోనే త్రుటిలో సెంచ‌రీ చేజార్చుకున్నాడు. డామ్ బెస్ బంతికి చిక్కి పెవిలియ‌న్ చేరాడు. అయితే, ఇక్క‌డ వ్య‌క్తిగ‌త రికార్డు కంటే జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న వేళ, అంటే 225 పరుగుల వద్ద ఆరో వికెట్‌గా పంత్ వెనుదిర‌గ‌డంపైనే అంద‌రూ ఫోక‌స్ చేశారు. కాస్త నిల‌క‌డ‌గా ఆడి ఉంటే టీమిండియాకు ఫాలో ఆన్ గండం ఈజీగా త‌ప్పిపోయేద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

బాధ్య‌తాయుతంగా ఆడాల్సిన స‌మ‌యంలో అవుట్ కావ‌డంపై పంత్ మ‌రోసారి విమ‌ర్శ‌లు ఎదుర్కొంటున్నాడు. కొంత‌మంది మాత్రం ప్ర‌తి విష‌యానికి పంత్‌ను త‌ప్పుప‌ట్ట‌డం స‌రికాద‌ని అత‌డికి అండగా నిలుస్తున్నారు. కోహ్లి(11), ర‌హానే(1) సంగ‌తి ఎవ‌రూ ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని పంత్ అభిమానులు సోష‌ల్ మీడియాలో ప్ర‌శ్నిస్తున్నారు. కాగా మూడో రోజు ఆట ముగిసే స‌రికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 74 ఓవ‌ర్ల‌లో 257 ప‌రుగులు చేసింది.

కెప్టెన్ సూప‌ర్ క్యాచ్‌.. వైస్ కెప్టెన్ ఔట్‌!

నిమ్మ‌గ‌డ్డ‌కు పిచ్చి బాగా ముదిరింది!

నేను బాగానే ఉన్నా.. 10 ఏళ్ల వరకు నేనే సీఎంగా ఉంటా!

దానిమ్మ తో ఎన్నో ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -