Tuesday, April 30, 2024
- Advertisement -

ఎంపీ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం..‌!

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యే సీత‌క్క విజ్ఞ‌ప్తి మేర‌కు అచ్చంపేట నుంచి పాద‌యాత్ర చేస్తూ హైద‌ర‌బాద్‌కు బ‌య‌ల్దేరారు. నూత‌న వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళ‌న‌ల‌కు మ‌ద్ద‌తుగా రేవంత్ రెడ్డి అచ్చంపేట‌లో రాజీవ్ రైతు భరోసా దీక్షలో పాల్గొన్నారు. అక్క‌డికి వ‌చ్చిన సీత‌క్క‌.. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌ధాని మోదీ, వ‌ద్ద మోక‌రిల్లార‌ని, కార్పొరేట్ల‌కు అన్న‌దాత‌ను తాకట్టు పెట్టాల‌నుకుంటున్నార‌ని మండిప‌డ్డారు.

నార్్త‌లో రైతులు ఉధ్రుత పోరాటం చేస్తున్నార‌ని, ఇక్క‌డ మనం మాత్రం పెద్ద‌గా ఏమీ చేయ‌డం లేదని వాపోయారు. దీక్ష కాదు మ‌నం చేయాల్సింది.. రైతు భ‌రోసా యాత్ర చేయాల‌ని ఉద్వేగంగా మాట్ల‌డారు. హైద‌రాబాద్ వ‌ర‌కు పాద‌యాత్ర‌గా వెళ్లాల‌ని రేవంత్‌రెడ్డిని సీత‌క్క కోరారు. ఇందుకు ఆయ‌న అంగీక‌రించారు. వెంట‌నే పాదయాత్ర మొదలు పెట్టారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. ఎక‌రం భూమి ఉన్నా చాలు రైతు ఆత్మ‌గౌర‌వంగా భావించి వ్య‌వ‌సాయం చేస్తాడ‌ని, అంతేగానీ కోట్లు సంపాదించ‌డానికి కాద‌ని రేవంత్ రెడ్డి అన్నారు.

అంద‌రికీ అన్నంపెట్టే అన్న‌దాత పంట‌కు ద‌ళారీ ధ‌ర నిర్ణ‌యించ‌డం ఏంట‌ని వాపోయారు. కార్పొరేట్ కంపెనీలకు రుణ‌మాఫీ చేసిన ప్ర‌ధాని మోదీ, రైతుల జీవితాల‌ను అంబానీ, అదానీల‌కు అమ్మ‌బోతున్నారంటూ మండిప‌డ్డారు. రాష్ట్రంలో కేసీఆర్ తీరు కూడా అలాగే ఉంద‌ని, కేంద్రం నిర్ణ‌యాల‌ను ఆయ‌న స‌మ‌ర్థిస్తున్నాడ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతులు క‌ష్టాల్లో ఉంటే తాను కార్ల‌లో ఎలా వెళ్తానంటూ పాద‌యాత్ర‌గా బ‌య‌ల్దేరారు రేవంత్ రెడ్డి.

నేను బాగానే ఉన్నా.. 10 ఏళ్ల వరకు నేనే సీఎంగా ఉంటా!

ఆ జీవో బాబే తెచ్చారు.. వ‌ల్ల‌భ‌నేని వంశీ ఫైర్‌!

టిడిపికి రిలీఫ్.. నిన్న రాజీనామా నేడు యూ టర్న్!

హైద‌రాబాద్‌లో ఎండ్ల బండ్ల ర్యాలీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -