మారుతి డైరెక్ష‌న్‌లో రవితేజ మూవీ !

- Advertisement -

చాల రోజుల నుంచి హిట్ కోసం ఎదురు చూసిన ర‌వితేజ‌కు ఇటీవ‌ల విడుద‌లైన ‘క్రాక్’ సినిమాతో మంచి విజ‌యం ద‌క్కింది. క‌రోనా వైర‌స్ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. బాక్సాఫీస్ ను క్రాక్ సినిమా షేక్ చేసింది. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో య‌మ స్పీడ్ తో వ‌ర‌సు ప్రాజెక్టుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు ఈ మాస్ మ‌హారాజ ర‌వితేజ‌.

ప్ర‌స్తుతం ఆయ‌న ర‌మేష్ వ‌ర్శ ద‌ర్శ‌క‌త్వంలో ‘ఖిలాడి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ష‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇది ఇంకా పూర్తి కాక‌ముందే మ‌రో ప్రాజెక్టుకు ర‌వితేజ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. మాస్ ఆడియేన్స్ తో పాటు యూత్ దృష్టిలో పెట్టుకుని వ‌స్తున్న క‌థ‌తో త్రినాధ్ రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వ‌లో ఓ సినిమా చేయ‌డానికి ర‌వితేజ ఒకే చెప్పాడు.

- Advertisement -

ఇదిలా ఉండ‌గా డైరెక్ట‌ర్ మారుతి ద‌ర్శ‌క‌త్వంలోనూ ఓ సినిమా చేయ‌డానికి ర‌వితేజ ఒకే చెప్పాడ‌ని సినీ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. తాజాగా మారుతి ఆ సినిమా క‌థ‌ను ర‌వితేజ‌కు వినిపించ‌డం.. వెంట‌నే మాస్ మ‌హారాజ ఒకే చెప్ప‌డం జ‌రిగిపోయింద‌ట‌. అయితే, ఈ సినిమా బ‌డ్జెట్‌.. రెమ్యూన‌రేష‌న్ కార‌ణంగా ఈ ప్రాజెక్టు ముందుకు సాగ‌లేదు. ప్రస్తుతం మ‌రో నిర్మ‌త ర‌వితేజ‌, మారుతి కాంభోలో సినిమా తీయ‌డానికి మందుకు వ‌చ్చార‌ని స‌మాచారం.

కాగా, మారుతి ప్రస్తుతం గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే రవితేజతో సినిమాను పట్టాలెక్కించనున్నాడు. దీనితో పాటు మ‌రో రెండు సినిమాల‌కు ర‌వితేజ ఒకే చెప్ప‌డాట‌.

ఈ ‘పుడింగి నెంబర్ 1’ ఆ ఇద్ద‌రితో ఏం చేస్తాడో మ‌రి !

జింద‌గీ కొత్తగా న‌వ్వుతోందంటున్న’ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’

తెలుగువారు గర్వించదగ్గ మూవీ ఇది: మెగాస్టార్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్.. ఓ ట్రెండ్ సెట్ట‌ర్ !

అల్లు అరవింద్‌కు కరోనా.. ఏం జరిగిందంటే !

Related Articles

Most Read

- Advertisement -
Loading...
- Advertisement -

Latest News