Friday, April 26, 2024
- Advertisement -

న్యూ లుక్ తో అల్లు అర్జున్..!

- Advertisement -

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్. తనదైన నటన డాన్స్, ఫైట్స్ తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నాడు. ఇప్పటి వరకు బన్ని స్టైలిష్ స్టార్ గానే కనిపించాడు. అయితే మొదటి సారిగా పుష్ప చిత్రంలో ఊరమాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. కలప స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై బన్నీ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.

మొన్నటి వరకు గుబురు గడ్డం.. పెరిగిన జుట్టుతో కనిపించిన బన్ని తాజాగా చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. ప్రస్తుతం స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ కు సంబంధించిన ప‌లు ఫొటోలు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి. కొత్త సినిమా ‘చావు కబురు చల్లగా’ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత శరత్‌ చంద్ర నాయుడు బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ త‌న తండ్రి అల్లు అరవింద్‌, సోద‌రుడు అల్లు శిరీష్‌తో క‌లిసి హాజ‌ర‌య్యాడు.

అల్లు అరవింద్‌ సమర్పణలో కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న‌ ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్య‌వ‌హ‌రించారు. అల్లు అర్జున్ క‌ళ్ల‌జోడు పెట్టి, గెడ్డం పెంచి కొత్త లుక్‌లో క‌న‌ప‌డుతుండ‌డం అభిమానుల‌ను ఆక‌ర్షిస్తోంది. కాగా, కార్తికేయ, లావ‌ణ్య త్రిపాఠి హీరో, హీరోయిన్లుగా నటించిన ‘చావు కబురు చల్లగా’ సినిమా ఈ నెల‌ 19న విడుదల కానుంది. 

నాగార్జున‌కు కాజ‌ల్ గ్రీన్‌సిగ్న‌ల్ !‌

ర‌జినీ కాంత్ సినిమాపై క‌రోనా దెబ్బ !

మీ కోసం కొత్త టెండర్ వేసిన సీఎం జగన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -