Friday, April 26, 2024
- Advertisement -

ర‌జినీ కాంత్ సినిమాపై క‌రోనా దెబ్బ !

- Advertisement -

సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్ సినిమాపై క‌రోనా దెబ్బ ప‌డింది. దీంతో ఆయ‌న సినిమా పూర్తి కావ‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశ‌ముంది. ర‌జినీ కాంత్ ప్ర‌స్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షెడ్యూల్ ఇటీవ‌లే హైద‌రాబాద్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఆయ‌న మ‌ళ్లీ అనారోగ్యానికి గుర‌య్యారు. ప్ర‌స్తుతం ఆయ‌న న‌గ‌రంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

కాగా, ఆ మ‌ధ్య కాలంలో సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశం చేయాల‌ని భావించారు. ఈ నేప‌థ్యంలోనే కొంత స‌మ‌యం పాటు ఆయ‌న అభిమాన సంఘాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. ఇక తాను స్థాపించ‌బోయే రాజ‌కీయ పార్టీ వివ‌రాలు వెల్ల‌డిస్తాన‌ని తేదీ కూడా ప్ర‌క‌టించారు. కానీ చివ‌ర‌కు తాను రాజ‌కీయాల‌కు రావ‌డం లేద‌ని పేర్కొన్నారు.

ఇక పూర్తిగా త‌న జీవితం సినిమాల‌తో న‌డుస్తుందంటూ వెల్ల‌డించారు. దీనికి కార‌ణం ఆయ‌న ఆరోగ్య‌మే అని చెప్పాలి. అనారోగ్యం నుంచి కోలుకున్నాక మ‌ళ్లీ అన్నాతే సినిమా షూటింగ్‌లో బిజీ అయ్యారు. కానీ దేశంలో మ‌ళ్లీ క‌రోనా విజృంభ‌ణ మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఆరోగ్యం దృష్ట్యా బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. దీంతో ర‌జినీ సినిమాలు ఇప్ప‌ట్లో వ‌చ్చే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు. ఈ విష‌యం తెలిసి ర‌జినీ అభిమానులు నిరాశ వ్య‌క్తం చేస్తున్నారు.

కారును ఢీ కొట్టిన విమానం !

మజ్జిగతో బోలెడు లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు !

సందీప్ రెడ్డి డైరెక్ష‌న్‌లో సూపర్ స్టార్ మ‌హేష్‌

మీరు పొగతాగుతారా..? అయితే మీ పిల్లలు క్యాన్సర్‌ బారినపడే అవకాశాలున్నాయి

దేశంలో తొలి లీగల్ సెక్స్ స్టోర్ ఎక్క‌డుందో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -