Wednesday, May 8, 2024
- Advertisement -

మీ కోసం కొత్త టెండర్ వేసిన సీఎం జగన్..!

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ లో మద్యం కొనుగోళ్ల కోసం టెండర్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాలరెడ్డి నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమిస్తూ.. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఉత్తర్వులు జారీ చేశారు.

దేశంలో తయారైన మద్యం, విదేశీ మద్యం, బీర్ల కొనుగోలు టెండర్లను ఖరారు చేసేందుకు.. కమిటీని నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ కమిటీ ఛైర్మన్​గా హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ గోపాల రెడ్డి, సభ్యులుగా విశ్రాంత ఐఎఎస్ అధికారి డి. వరప్రసాద్, చార్టెడ్ అకౌంటెంట్ కూసిరెడ్డి మరిడేశ్వరరావును నియమించారు.

వివిధ మద్యం తయారీ కంపెనీలతో మద్యం కొనుగోలు టెండర్లను ఖరారు చేసే అంశంపై.. ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ తరపున.. త్రిసభ్య కమిటీ సంప్రదింపులు జరపనుంది. రాష్ట్రంలో విక్రయించే విదేశీ మద్యం, బీర్ల బ్రాండ్లకు సంబంధించి ధరలను కూడా కమిటీ ఖరారు చేయనుంది.

ఎన్నికల వేళ బెంగాల్ లో బిజెపి షాక్..!

ఏపీ ఎన్నికల సంఘానికి హైకోర్టులో మరోసారి చుక్కెదురు

కరోనా అలెర్ట్.. ఆ స్కూల్ లో డేంజర్ బెల్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -