Saturday, May 4, 2024
- Advertisement -

మహేశ్ బిస్ట్ మోడ్.. సిక్స్ పాక్ కోసమేనా ?

- Advertisement -

సూపర్ స్టార్ మహేశ్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ” SSMB28 ” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై సూపర్ స్టార్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ” అతడు “, ఖలేజా ” చిత్రాలు కమర్షియల్ గా పెద్దగా విజయం సాధించనప్పటికి బుల్లి తెరపై మాత్రం కల్ట్ క్లాసిక్ మూవీస్ గా నిలిచాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్ కోసం 13 ఏళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల ఆశలు ఫలించి ఎట్టకేలకు ఈ వీరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ సెట్స్ పైకి వెళ్లింది.

ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలో రెండవ షెడ్యూల్ కూడా ప్రారంభం కానుంది. ఇక ఈ మూవీని పక్కా యాక్షన్ ఓరియంటెడ్ గా రూపొందిస్తున్నట్లు చిత్రయూనిట్ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. అందుకు తగ్గట్లుగానే మహేశ్ లుక్ మెకోవర్ డిఫరెంట్ గా ఉండబోతున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్ చూస్తే అర్థమౌతోంది. ఇక ఈ మూవీ లో మహేశ్ సిక్స్ పాక్ తో కనిపించబోతున్నాడనే వార్తలు ఇటీవల బాగా వైరల్ అవుతున్నాయి.

అందుకు తగ్గట్లుగానే మహేశ్ జిమ్ లో కూడా ముమ్మర కసరత్తులు చేస్తున్నాడు. ఇక తాజాగా మహేశ్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న ఓ పోటో ను చిత్రయూనిట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ” మహేశ్ బిస్ట్ మోడ్.. స్క్రిన్స్ ఆన్ ఫైర్ ” అనే క్యాప్చన్ జోడించి ట్విట్టర్ లో షేర్ చేసింది. దాంతో ఆ ఫోటోను సూపర్ స్టార్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఇక ఇంతవరకు సిక్స్ పాక్ లో కనిపించని మహేశ్.. మొదటి సరిగా త్రివిక్రమ్ మూవీలో కనిపించబోతున్నాడనే వార్తలు రావడంతో.. సూపర్ స్టార్ అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. మరి ఈ మూవీతో మహేశ్ త్రివిక్రమ్ కాంబినేషన్ ఎలాంటి సంచలనలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

ఎన్టీఆర్ ను ఇబ్బంది పెడుతున్న ” అది పురుష్ ” !

బింబిసార సిక్వల్ లో రాంచరణ్..ఫ్యాన్స్ కు పండగే?

వాల్తేరు వీరయ్య కోసం క్యూ కడుతున్న స్టార్ హీరోలు !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -