Saturday, May 4, 2024
- Advertisement -

ఎన్టీఆర్ కొరటాల మూవీకి పవర్ ఫుల్ టైటిల్ ?

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రకటించి ఏడాది అవుతున్న ఇంతవరకు సెట్స్ పైకి వెళ్లలేదు. ఒకానొక టైమ్ లో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు కూడా గట్టిగానే వినిపించాయి. అయితే ఇటీవల దర్శకుడు కొరటాల శివ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ లోని కొన్ని ఫోటోస్ ఆన్లైన్ లో దర్శనమివ్వడంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలకు పులిస్టాప్ పడింది. ఇక త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ మొదటి వారం లేదా రెండవ వారంలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందట.

ఇక ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి స్మాల్ టీజర్ ను ఆ మద్య రిలీజ్ చేసి మూవీపై మరింత బజ్ ను పెంచించి చిత్రయూనిట్. ఇక ఈ ప్రాజెక్ట్ ను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. ఇదిలా ఉంచితే ఈ మూవీకి సంబంధించిన టైటిల్ విషయంలో.. సోషల్ మీడియా లో రకరకాల టైటిల్స్ తెరపైకి వస్తున్నాయి. ఇక తాజాగా ఈ మూవీకి ” దేవర ” అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ” NTR30 ” అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీకి స్టోరీ పరంగా ” దేవర ” అనే టైటిల్ కరెక్ట్ గా సెట్ అవుతుందట. అందుకే మూవీ యూనిట్ ఆ టైటిల్ కే ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇక గతంలో దేవర టైటిల్ లో ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ రిజిస్టర్ చేయించడట. అయితే బండ్ల ఆ టైటిల్ ను రెన్యూవల్ చేసుకోకపోవడంతో.. కొరటాల శివ ఆ టైటిల్ ను తీసున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్టీఆర్ మాస్ ఇమేజ్ కు తగ్గట్లుగా ” దేవర ” టైటిల్ ఉండడంతో ఆయన అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక ఈ టైటిల్ పై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందట. మరి కొరటాల శివ ” దేవర ” టైటిల్ నే ఫిక్స్ చేస్తారా ? లేదా వేరే టైటిల్ వైపు మొగ్గు చూపుతారా ? అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

గాడ్ ఫాదర్ ఎఫెక్ట్..చిరు ఈసారి ఆ తప్పు చేయడట?

ఒకే దారిలో రాంచరణ్, అల్లు అర్జున్.. నిరాశలో ఫ్యాన్స్ ?

మహేశ్ బిస్ట్ మోడ్.. సిక్స్ పాక్ కోసమేనా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -