ఒకే దారిలో రాంచరణ్, అల్లు అర్జున్.. నిరాశలో ఫ్యాన్స్ ?

Tension in Allu Arjun and Ram Charan Fans About What Next ?
Tension in Allu Arjun and Ram Charan Fans About What Next ?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు యూత్ లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మొన్నటి వరకు ఒక్క తెలుగుకే పరిమితం అయిన ఇద్దరు హీరోలు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ గా కొనసాగుతున్నారు. ” ఆర్ ఆర్ ఆర్ ” రామ్ చరణ్ పాన్ ఇండియాలో పాగా వేస్తే, అల్లు అర్జున్ ” పుష్ప ” మూవీ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సంచలనం సృష్టించాడు. ఇక ఈ ఇద్దరి అప్ కమింగ్ మూవీస్ కోసం టోటల్ ఇండియా వైడ్ గా వెయిటింగ్ నడుస్తోంది.

ప్రస్తుతం రాంచరణ్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో మూవీ అంటే ఆ మూవీకి ఉండే క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇక అల్లు అర్జున్ పుష్ప సిక్వల్ గా తెరకెక్కుతున ” పుష్ప 2 ” తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఇంత వరకు బాగానే ఉన్నప్పటికి ఈ ఇద్దరి హీరోల ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ప్రాజెక్ట్ లు కంప్లీట్ అయిన తరువాత.. నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి అనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న మాట. రామ్ చరణ్ కోసం కన్నడ దర్శకుడు నార్థన్, పరుశురామ్ వంటి దర్శకులు లైన్ లో ఉన్నప్పటికి ఇంకా ఎవరికి ఒకే చెప్పలేదు.

ఇక అల్లు అర్జున్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పుష్ప తరువాత బన్నీని డైరెక్ట్ చేసే దర్శకుడు ఎవరో అని ఆయన అభిమానులు తలపట్టుకుంటున్నారు. పుష్ప తరువాత బన్నీ హోల్డ్ లో పెట్టిన ” ఐకాన్ ” మూవీ పట్టలేక్కించే అవకాశం ఉదని వార్తలు వస్తున్నప్పటికి ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. అలాగే బన్నీతో మూవీ ఉంటుందని అధికారికంగా ప్రకటించిన కొరటాల శివ ప్రాజెక్ట్ కూడా ఉంటుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే కొరటాల ప్రస్తుతం ఎన్టీఆర్ తో మూవీ చేస్తున్నాడు. ఆ తరువాతే బన్నీ మూవీ గురించి కొరటాల ఆలోచించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికి పాన్ ఇండియా స్టార్స్ గా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్నా రామ్ చరణ్, అల్లు అర్జున్.. వారి యొక్క తరువాతి మూవీస్ ఎవరితో అనే ప్రశ్న వారిద్దరి అభిమానుల్లో మెదులుతోంది. మరి వీరిద్దరి హీరోలను డైరెక్ట్ చేసే దర్శకులెవరో మరి.

ఇవి కూడా చదవండి

చిరులో మార్పు.. గాడ్ ఫాదర్ ఎఫెక్టే ?

మహేశ్ బిస్ట్ మోడ్.. సిక్స్ పాక్ కోసమేనా ?

ఎన్టీఆర్ ను ఇబ్బంది పెడుతున్న ” అది పురుష్ ” !