Sunday, May 5, 2024
- Advertisement -

విజయ్ కి షాక్ ఇచ్చిన అమలా పాల్

- Advertisement -

ప్రేమించి పెళ్లి చేస్కుని విడాకుల వరకూ వచ్చిన అమలపాల్ ఇప్పుడు హీరోయిన్ గా మళ్ళీ నిలదొక్కుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇంత ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని హ్యాపీగా సంసారం చేస్కుంటుంది అనుకున్న ఆమె అత్తా మామలతో గొడవలు పడి విడాకుల వరకూ తెచ్చుకుంది పరిస్థితి . వివాహం తరవాత కూడా సినిమాల్లో నటించడం అనే విషయం లో అమల పాల్ ఆమె అత్తా మామల మధ్యన రేగిన గొడవ రచ్చ రచ్చగా మారింది.

అయితే ఈ విషయంలో విజయ్ తండ్రి తమిళంలో పెద్ద నిర్మాత కావడం వల్ల ఎందుకొచ్చిన తంట అని.. అమలాపాల్ పై అనధికారిక బ్యాన్ విదించారనే వార్తకు కూడా అప్పట్లో వచ్చాయి. అయితే అమలాపాల్ కు ఎవ్వరూ ఛాన్సులు ఇవ్వడం లేదనే వార్తలు వస్తున్నప్పుడు.. ఒక కన్నడ సినిమాకు సైన్ చేసి షాక్ ఇచ్చింది. అక్కడితో ఆగని అమల మరోసారి భర్త విజయ్ తో పాటు చాలా మందికి దిమ్మతిరిగే పని చేసింది. తమిళ హీరో విజయ్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా అమలా ఎంపికైనట్లు అప్పట్లో కోలీవుడ్ లో వార్తలు వచ్చాయి.

అయితే.. ఈ సినిమాకు దర్శకత్వం వహించేది అమలాపాల్ భర్త విజయ్ అనితెలిసింది. ఈ క్రమంలో దర్శకుడు విజయ్ – హీరో విజయ్ లు చేస్తున్న ఈ సినిమాకి నిర్మాతలు హీరోయిన్ గా అమలాను తీసుకుందామనుకున్నారట. ఈ ప్రపోజల్ కు అమలా ఒప్పుకోదులే అనుకొని డైరెక్టర్ విజయ్ ఈ సినిమాకి ఒప్పుకున్నాడట. అయితే అంతా ఓకే అయిన తర్వాత ఈ సినిమాకు తానుకూడా ఒప్పుకొని అమలా షాక్ ఇచ్చింది. దీంతో సినిమాల్లో నటించడం అనే అంశంపై విడాకులు తీసుకుంటున్నారో.. అదే విషయంపై ఇప్పుడు వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారు. ఇది కచ్చితంగా అమలాపాల్ విజయ్ కు ఇచ్చిన షాక్ గానే తమిళ సినీజనాలు భావిస్తున్నారట!!

Related

  1. పాపం అమలపాల్ ని ధనుష్ కూడా కాపాడలేక పోయాడు
  2. అమెరికా వెళ్తున్న బిచ్చగాడు!
  3. అమ్మాయిని చూస్తే అరస్ట్ చేస్తారు
  4. మీ లవర్ ముందు వేరే అమ్మాయిని చూస్తే ఏమ‌వుతుంది ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -