- Advertisement -

అమ్మాయిని చూస్తే అరస్ట్ చేస్తారు

- Advertisement -

ఆడపిల్లల మీద, ఆడవారి మీద ఈ దేశం లో ఏ రేంజ్ లో లైంగిక వేధింపులు పెరిగాయి అనేది స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ రోజూ ఎదో ఒక మూల ఎదో ఒక సందర్భం లో ఈ లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. ఈవ్ టీజింగ్ లని ఎంతగా అరికట్టాలి అని చూసినా కూడా ఆగడం లేదు. ఈ విషయం మీదస్పందించిన ఒక పోలీస్ ఆఫీసర్ కాస్త వింతగా సొల్యూషన్ చెప్పారు.

అమ్మాయిలపై జరుగుతున్న లైంగిక వేధింపులను అరికట్టేందుకు కేరళలోని ఓ ఎక్సైజ్ కమిషనర్ రిషిరాజ్ సింగ్ ఒక సూచన చేశారు. పంద్రాగస్టు వేడుకల సందర్భంగా కొచ్చిలో ఏర్పాటుచేసిన ఓ బహిరంగ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన.. ఎవరైనా ఒక అబ్బాయి పద్నాలుగు సెకన్లపాటు తదేకంగా ఒక అమాయి కళ్లలోకి చూస్తే వెంటనే ఎఫ్ ఐఆర్ నమోదు చేయవచ్చని అన్నారు.

అలాగే.. బహుశా ఈ విషయం ఎవరికీ తెలియదేమో అని కూడా వ్యాఖ్యానించారు. కాకపోతే.. ఇలాంటి కేసు ఇప్పటివరకూ ఒక్కటికూడా నమోదుకాలేదని – అలా జరిగి ఉంటే మాత్రం అమ్మాయిలపై వేధింపులు తగ్గుముఖం పట్టేవని ఆయన అభిప్రాయపడ్డారు. కేరళలో మహిళలు – యువతులపై జరుగుతున్న ఆకృత్యాలను తన ప్రసంగంలో ప్రస్థావించిన రిషిరాజ్ సింగ్.. ఎవరైనా అభ్యంతరకరంగా మాట్లాడినా వెనుకాలే ఫాలో అవుతూ విసిగించినా.. వెంటనే స్పందించి – వారికి అక్కడే బుద్ధి చెప్పాలని అన్నారు.

Related

  1. మీ లవర్ ముందు వేరే అమ్మాయిని చూస్తే ఏమ‌వుతుంది ?
  2. కాలేజీ అమ్మాయిపై గ్యాంగ్ రేప్
  3. బాయ్ ఫ్రెండ్ మిస్ అయితే అమ్మాయిలు ఇలా ఫీల్ అవుతారు!
  4. చంద్రబాబు గురూజీ ఇద్దరు అమ్మాయిలని దాచేశారు ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -