Sunday, May 12, 2024
- Advertisement -

జనతా గ్యారేజ్ ని వెంటాడుతున్న ప్లాప్ సెంటిమెంట్ !

- Advertisement -

సరిగ్గా వారం రోజులలో జనత గ్యారేజ్ సినిమా విడుదల కి సిద్దం అవుతున్న తరుణం లో ఎన్టీఆర్ ఫాన్స్ కి ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుంది. సెంటిమెంట్ లు బాగా నమ్మే కొందరు ఎన్టీఆర్ అభిమానులు జనతా గ్యారేజ్ హిట్ అవుతుందా లేదా అనే విషయం లో సీరియస్ డిస్కషన్ లు సాగిస్తున్నారు. హీరోయిన్ లు తెచ్చి పెట్టె లక్కు ఫార్మ్ లో ఉన్న ఎన్టీఆర్ హ్యాండిల్ చెయ్యగలడా లేదా అని ఆలోచిస్తూ ఉన్నారు.

ఎన్టీఆర్ తో కలిసి బృందావనం.. బాద్ షా.. టెంపర్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించింది కాజల్. ఈ మూడు సినిమాలు హిట్స్ గానే నిలిచాయి. కానీ జూనియర్ తో సమంత బృందావనం.. రభస.. రామయ్యా వస్తావయ్యా చిత్రాల్లో సమంత యాక్ట్ చేసింది. వీటిలో బృందావనం మినహాయిస్తే.. సమంత లీడ్ రోల్ చేసిన మూవీస్ ఫ్లాప్స్ గా నిలిచాయి.

ఇప్పుడు జనతా గ్యారేజ్ కి ఏ హీరోయిన్ సెంటిమెంట్ పని చేస్తుందో అర్ధం కాని పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఇలా విడివిడిగా చూసే బదులు.. కాజల్-సమంతలు ఇద్దరూ బృందావనంలో ఎన్టీఆర్ తో యాక్ట్ చేశారు కాబట్టి.. ఆ ఫ్యాక్టరే ఎక్కువగా పని చేస్తుందని చెప్పేసుకుంటున్నారు ఫ్యాన్స్. పైగా చందమామ తమ హీరోకి బోలెడంత అదృష్టాన్ని మోసుకొచ్చేస్తుందని ఆశలు పెట్టేసుకున్నారు.

Related

  1. జనతా గ్యారేజ్ స్టోరీ ఇదేనా?
  2. జనతా గ్యారేజ్ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
  3. జనతా గ్యారేజ్ లో సాంగ్స్ కాపీ కొట్టిన దేవిశ్రీ!
  4. జనతా గ్యారేజ్ లో రెండు క్లైమాక్స్ లు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -