అమితాబ్ ని నమ్ముకునే నాగ్ అశ్విన్ సినిమా చేస్తున్నాడా..?

- Advertisement -

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా లో దీపికా పదుకొనె నటిస్తుండగా అశ్వని దత్ ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా రాధేశ్యామ్ సినిమా పూర్తి కాగానే సెట్స్ మీదకు వెళ్తుండగా ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతుండడం విశేషం.. ఇక తాజాగా ఈ సినిమాలో బిగ్ బీ కూడా నటిస్తున్నారని అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆదిపురుష్.. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. 3-డీలో రూపొందనున్న ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్ – కృష్ణ కుమార్ – ప్రసాద్ సుతార్ – రాజేష్ నాయర్ – ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. తెలుగు హిందీ భాషల్లో సినిమా ను నిర్మించి దాదాపు 25 భాషల్లోకి ఈ సినిమా ని డబ్ చేస్తారట.. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా లో రాముడిగా ప్రభాస్ నటిస్తుంటే రావణాసురుడు గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు..

ఇక విషయానికొస్తే ప్రభాస్ నాగ్ అశ్విన్ ల కాంబో లో వస్తున్న సినిమా టైటిల్ ఇప్పుడు కొంత ఆసక్తికరంగా మారింది.. ఇప్పటికే దీపికా తో పాటు బిగ్ బీ కూడా సినిమాలో ఉన్నారు.. అయితే అమితాబ్‌ది ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్ అని అతను వెల్లడించాడు. అంతే కాక మరో కీలకమైన విషయాన్ని అతను బయటపెట్టాడు. ఈ సినిమా స్క్రిప్టు ఫస్ట్ డ్రాఫ్ట్‌లో అనుకున్న వర్కింగ్ టైటిల్.. అమితాబ్ చేయబోయే పాత్ర పేరే అని నాగ్ అశ్విన్ చెప్పడం విశేషం. ఐతే ఇప్పుడా టైటిల్‌ను కొనసాగిస్తున్నారా లేదా అన్నది మాత్రం వెల్లడించలేదు. బిగ్-బి పాత్ర పేరునే సినిమా టైటిల్‌గా పెట్టాలన్న ఆలోచన వచ్చిందంటే ఆయనది హీరోతో సమానమైన పాత్రగా భావించవచ్చు.

ప్రభాస్ కు బాగా ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

మహేష్ తో త్రివిక్రమ్ ఆల్మోస్ట్ ఓకే చేసినట్టే..?

అనుష్క తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే నా..?

అల్లు అర్జున్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా ?

- Advertisement -

Related Articles

Most Populer

- Advertisement -

Recent Posts

- Advertisement -