Saturday, April 20, 2024
- Advertisement -

జగన్ Vs నిమ్మగడ్డ.. ఏపీలో స్థానిక ఎన్నికలు జరుగుతాయా ?

- Advertisement -

ఏపీలో స్థానిక ఎన్నికలు విషయం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ ఏడాది మార్చిలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం అయిన విషయం తెలిసింది. అంత జోరుగా సాగుతోంది కొన్నిచోట్ల ఏకగ్రీవాలు కూడా అయ్యాయి. ఇక నాలుగు రోజులో ఎన్నికలు జరగాల్సి ఉండగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా వున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో ఎన్నికల్లో ఆపుతున్నామన్నారు. వాస్తవానికి అప్పటికింకా దేశంలో కరోనా ఎక్కువగా లేదు రాష్ట్రంలో అసలు లేదు.

పైగా కేంద్రం కూడా ఎక్కడా లాక్ డౌన్ నిర్ణయం తీసుకోలేదు. అయితే ముందు జాగ్రత్త లో భాగంగా ఆయన ఎన్నికలకు బ్రేకులు వేశారు అని చెప్పుకొచ్చారు. ఇది వివాదంగా మారింది. ఎన్నికలు జరిగి తీరాల్సిందేనని జగన్ సర్కార్ పట్టుబట్టింది. ఇక ఈ వివాదం సామాజిక వర్గాల పై విమర్శలు చేసుకునే వరకు కూడా వెళ్ళింది. అటు నుంచి కోర్టు మెట్లెక్కింది. కమిషనర్ పదవీకాలం ముగిసేలా ఓ ఆర్డినేస్ తీసుకురావడం దీనికి హైకోర్టుకు కొట్టేయడం.. మొత్తంగా నిమ్మగడ్డ విజయం సాధించారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్నికలు నిర్వహించాలంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఎన్నికలు ఎందుకు నిర్వహించడంలేదని ప్రశ్నించింది. దీనిపై స్పందించిన సర్కార్ కరోనా నేపథ్యంలోనే ఆపేసినట్లు తెలిపింది. అయితే మిగిలిన రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతున్నాయన్న హైకోర్టు విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు బదిలీ చేసింది. అయితే ఇప్పుడు కమిషనర్గా ఉన్న నిమ్మగడ్డ ఏం చెబుతారు.. ప్రభుత్వం ఏం చేస్తుంది.. గత పరిణామాలతో రాష్ట్ర సర్కారు నిమ్మగడ్డ పై తీవ్ర ఆగ్రహంతో ఉంది.

ఎన్నికల నిలుపుదల విషయంలో కనీసం ప్రభుత్వానికి ఒక్క మాట కూడా చెప్పకపోవడాన్ని వేలెత్తి చూపింది. ఇప్పుడు మరి ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. గతంలో సుప్రీంకోర్టు కూడా ఇదే చెప్పింది. మీరు ఏం చేయాలనుకున్నా ముందు సర్కార్ కు చెప్పి చేయాలని ఆదేశించింది. ఇప్పుడు నిమ్మగడ్డ ఎన్నికలకు రెడీ అయ్యే అవకాశం ఉంది. కానీ సర్కారు కాదని అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి ఇది హైకోర్టుకు వెళ్లే అవకాశముంది. అటు నిమ్మగడ్డ ఇటూ జగన్ మరోసారి వివాదానికి తెర తీసే ఛాన్స్ కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.

చంద్రబాబు ఇలాంటి రాజకీయాలు ఎవరికోసం..?

రివర్స్ గేమ్ ఆడుతున్న కేసీఆర్….?

గంటా శ్రీనివాస్ రావు వైసీపీ లోకి లైన్ క్లియర్…

గులాబీ పార్టీ మళ్ళీ కొత్త చట్టం తేబోతుందా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -