Saturday, April 20, 2024
- Advertisement -

ఊపిరి పీల్చుకుంటున్న ముంబాయి.. భారీగా పడిపోయిన కొత్త కేసులు!

- Advertisement -

దేశంలో కరోనా సెకండ్ వేవ్ మొదలైనప్పటి నుంచి మహారాష్ట్ర వణికి పోయింది. వేల కొద్ది కేసులు వందల్లో మరణాలు సంబవించాయి. దాంతో కరోనా కట్టడి చేయడానికి ఇక లాక్ డౌన్ శరణ్యం అయ్యింది. ఈ నేపథ్యంలోనే గత రెండు వారాలుగా అక్కడ లాక్ డౌన్ విధించారు. ఇప్పుడు ముంబై మహానగరం కరోనా వైరస్ నుంచి నెమ్మదిగా కోలుకుంటోంది. సోమవారం నాడు 2,624 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

ఇదే సమయంలో రోజువారీ టెస్టుల సంఖ్య కూడా 50 వేల నుంచి 38 వేలకు తగ్గిందని అధికార గణాంకాలు వెల్లడించాయి. అయితే నిన్న 68 మంది కన్నుమూయగా, మొత్తం మరణాల సంఖ్య 13,372కు పెరిగింది. ముంబాయిలో రోజువారీ కేసుల సంఖ్య 10 వేలకు పెరిగాయి.

గత ఏడాది కన్నా ఈసారి కరోనా ఎఫెక్ట్ బాగా పడింది. దేశంలోనే అత్యధికంగా నష్టపోయిన నగరంగా ముంబై నిలిచింది. ఆ తర్వాత ఢిల్లీలో కూడా భారీగా కేసులు పెరిగిపోయాయి. గత నెలలో మహారాష్ట్రలో ఒకరోజు కేసుల సంఖ్య 60 వేలను దాటిందంటే పరిస్థితి ఎంత తీవ్రతరమైందో అర్థం చేసుకోవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన లాక్ డౌన్ నిబంధనల కారణంగానే కేసుల సంఖ్య అదుపులోకి వచ్చిందని ఆరోగ్య శాఖ పేర్కొంది.

తెలుగు తెరపై మరో నటవారసురాలు

డేర్ చేస్తున్న ఎన్టీఆర్.. కరోనా అంటే భయం లేదా?

ఇంత వయసు వచ్చినా రష్మి గౌతమ్ పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -