Monday, May 5, 2025
- Advertisement -

నా బయోపిక్ లో బోలెడంత మసాలా ఉంటుంది: అనసూయ

- Advertisement -

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఏ నడుస్తుందంటే బయోపిక్ హవా నడుస్తోంది అని చెప్పవచ్చు. ఎంతోమంది గొప్ప రాజకీయ నాయకులు, ఫ్రీడమ్ ఫైటర్ లు, సెలబ్రిటీల వంటి బయోపిక్ లు ఈ మధ్యకాలంలో ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. తీసేవాడు ఉండాలి కానీ ప్రతి ఒక్కరి జీవితాన్ని ఒక బయోపిక్ సినిమాగా తెరకెక్కించవచ్చు. ఈ క్రమంలోనే యాంకర్ అనసూయ కూడా తన బయోపిక్ చిత్రం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనసూయ సుశాంత్ భరద్వాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. పదహారేళ్లకే తనతో ప్రేమలో పడిన అనసూయ సుమారు ఏడేళ్ల నిరీక్షణ తర్వాత ఎన్నో కష్టాలను, అవమానాలను భరించి అతని పెళ్లి చేసుకొని ఇంటి నుంచి బయటకు వచ్చి ప్రస్తుతం ఈ స్థాయిలో ఉంది. తన ప్రేమ కథలో కూడా మంచి మసాలా ఉందని, తన భర్తతో ప్రేమ.. పెళ్లి.. పిల్లలు వీటిపై ఓపెన్ అయిన అనసూయ తన దగ్గర డబ్బులు బాగా ఉన్నప్పుడు తప్పకుండా నా బయోపిక్ తీస్తానని తెలిపారు.

Also read:సుల్తాన్ సినిమాలో ఈ రొమాంటిక్ సీన్ ను చూశారా ?

సాధారణంగా మా అమ్మకు పూజలు చేయడం ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే నన్ను అది తినకూడదు ఇది తినకూడదు అని కండిషన్లు పెట్టేది. నేను కూడా ఎక్కువగా గుళ్లకు వెళ్లి తాను ప్రేమించిన అతనితోనే ఎలాగైనా తన పెళ్లి జరిగేలా చూడాలని పూజలు చేసేదని తెలిపారు. అదే విధంగా ఏడు సంవత్సరాల పాటు చాక్లెట్, ఆలు తినకుండా సాయిబాబాకు వదిలేసినట్టు కూడా అనసూయ తెలిపారు. ఈ క్రమంలోనే తనకి కూతురు అంటే ఎంతో ఇష్టమని ఎలాగైనా తనకు 40 సంవత్సరాల వయసు వచ్చే లోపు ఒక కూతుర్ని కని పెంచాలనేదే తన కోరిక అని అనసూయ తన లవ్ గురించి ఓపెన్ అయ్యారు.

Also read:మెగాస్టార్ చిరంజీవికి ఎంతమంది ఫాలోవర్స్ తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -