ప్రభాస్ మూవీలో కొత్త ప్రపంచాన్ని చూస్తారు : నాగ్ అశ్విన్

- Advertisement -

బాహుబలి లాంటి బిగ్గెస్ట్ హిట్ చిత్రం తర్వాత ప్రభాస్ ‘సాహూ’ చిత్రంలో నటించాడు. ఈ చిత్రం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రాధేశ్యామ్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావొచ్చింది.. ప్రభాస్ సరసన పూజా హెగ్డె హీరోయిన్ నటిస్తుంది. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్ ’ లో నటిస్తున్నాడు. ఇక ‘సలార్’ .. ‘ఆది పురుష్’ రెండూ కూడా ఈ మధ్యనే సెట్స్ పైకి వెళ్లాయి.

ఈ రెండు సినిమాల తరువాత దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రాజెక్టునే ప్రభాస్ చేయనున్నాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ సినిమాలపై ఇప్పుడు యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ దృష్టిపడింది. ‘మహానటి’ ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఒకటి. ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి.

- Advertisement -

సరికొత్త సైన్స్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్న క్రమంలో వస్తోన్న అప్‌డేట్‌తో అందరిలో ఆసక్తినెలకొంది. తాజాగా ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడాడు.

తాజాగా ఆయన ఈ సినిమాను గురించి మాట్లాడాడు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నాం. ప్రేక్షకులకు తెరపై ప్రతీదీ కొత్తగా కనిపిస్తుంది. ఒక అద్భుతమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. ప్రతి ప్రేక్షకుడికి పైసా వసూల్ చిత్రంగా నిలిచి పోతుందని ఆయన అంటున్నాడు.

కరోనాపై సంచలన వ్యాఖ్యలు చేసిన రేణు దేశాయ్

తీన్మార్ మల్లనపై కేసు నమోదు.. కారణం అదేనా?

మళ్ళీ ప్రేమలో పడిన గోవా బ్యూటీ..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -