Friday, May 3, 2024
- Advertisement -

ఆ యాంకర్స్ చేసిన తప్పు నేను చేయను – లాస్య

- Advertisement -
Anchor Lasya on About Her Movie Offers

ఈ మధ్య కాలంలో టీవీ యాంకర్లు.. వెండితెరపై కనిపిండం బాగా పెరిగిపోయింది. బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకుని.. దాన్ని ఉపయోగించుకుని వెండితెరపై వెలిగిపోవాలనే.. ఐడియా అంతో ఇంతో బాగానే వర్కవుట్ అవుతోంది. జబర్దస్త్ బ్యూటీస్ గా పేరుతెచ్చుకున్న.. అనసూయ.. రష్మి.. ఆ తర్వాత పటాస్ తో పేరు తెచ్చుకున్న యాంకర్ శ్రీముఖి.. ఇలాగే సినిమాలోకి ఎంట్రీ ఇచ్చారు.

{loadmodule mod_custom,GA1}

లానీ.. అనసూయ.. రష్మీలు టీవీలో చూపించిన గ్లామర్ కంటే.. మరెన్నో రెట్లు సినిమాల్లో చూపించేస్తున్నారు. శ్రీముఖి కూడా అలాంటీ గ్లామర్ ను చూపించే ఛాన్సులు అందుకుంది. అంటే సినిమా కలను నెరవేర్చుకునేందుకు..  గ్లామర్ మీదనే తెగ ఆధారపడుతున్నారు. కాని.. కాస్య మాత్రం ఈ విషయంలో.. మోహమాటం లేకుండా నో అంటోంది. అనసూయ, రష్మీ, శ్రీముఖి చూపించినట్లు అందాలను నేను చూపించి తప్పు చేయను అంటోంది.

{loadmodule mod_custom,GA2}

త్వరలో రిలీజ్ కాబోతున్న ‘రాజా మీరు కేక’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న లాస్య.. పెర్ఫామెన్స్ పాత్రలు మాత్రమే తప్ప గ్లామర్ రోల్స్ చేయను అని.. చెప్పుతోంది. ‘రాజా మీరు కేకలో సినిమాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ పాత్ర పోషిస్తున్నాను. నలుగురు ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే కథ ఇది’ అంటున్న లాస్య.. యాంకరింగ్ కి సినిమాలకు చాలా తేడా ఉంటుందని.. యాంకరింగ్ కు ఎనర్జీ లెవెల్స్ తో పాటు అప్పటికప్పుడు స్పందించగలగాలని.. అదే యాక్టింగ్ కు మాత్రం చాలా తేడా ఉంటుందని అంటోంది. తన దగ్గరకు వచ్చిన ప్రతీ స్క్రిప్ట్ ను భర్త మంజునాథ్ కు చెబుతానని.. తన జడ్జిమెంట్ బాగుంటుందని అంటోంది. 

{youtube}XYuJ6rEn7uc{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -