Tuesday, May 14, 2024
- Advertisement -

యాంకర్ లాస్య తల్లి కాబోతుంది..?

- Advertisement -
Anchor Lasya Pregnant

బుల్లి తెరపై తనదైన శైలిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ లాస్య. లాస్య తన ఇంజనీరింగ్ కంప్లీట్ చేసాక.. యాంకరింగ్ లోకి అడుగుపెట్టింది. లాస్య తన కో- యాంకర్ రవితో కలిసి చేసిన మొండి మొగుడు- పెంకి పెళ్ళాం, సమ్ థింగ్ స్పెషల్, డీ, పలు షోలు బాగా పాపులర్ అయ్యాయి. దాంతో వీరిద్దరికి బాగా క్రేజ్ వచ్చింది.

లాస్య తెలుగు ప్రేక్షకులకు చేరువ కావడం.. మొదట్లో అంతా బాగానే ఉన్నా కొన్ని రోజుల తర్వాత యాంకర్ రవికి మరియు లాస్యకు మధ్య ఏదో లవ్ ఎఫైర్ ఉందని, పెళ్లి కూడా జరిగిపోయిందని వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే రిసెంట్ గా హీరో రాజ్ తరుణ్ తో కూడా లవ్లో ఉందని గుసగుసలు వినిపించాయి. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అన్ని విషయాలు తెలిపింది. తనకు ఎవరితో ఎఫైర్ లేదని తెల్చి చెప్పేసింది.

ఏది ఏమైన లాస్య మాత్రం మూడు నెలల క్రితం మహారాష్ట్రకు చెందిన బిజినెస్ మ్యాన్ మంజునాథ్ ను పెళ్లి చేసుకుంది. ప్రేక్షకులకు షాక్ ఇస్తూ ఎలాంటి వార్త బయటకి రాకుండా పెళ్లి చేసుకుంది లాస్య. ఇది ఇలా ఉంటే లాస్య ఇప్పుడు తల్లి కాబోతోంది. లాస్య అందుకే ఆ షోస్ ఒప్పుకోవట్లేదని తెలుస్తోంది. యాంకర్ లాస్యకు ఆడపిల్లా, లేదా మగపిల్లాడో పుట్టి మళ్ళీ షోస్ చేయాలనీ కోరుకుందాం.

Related

  1. యాంకర్ లాస్య గురించి ఎవరికి తెలియని సీక్రెట్
  2. లాస్య, రాజ్ తరుణ్ పెళ్లి రూమర్ వెనక అసలు నిజం ఇదే!
  3. రవి, లాస్యల బంధంపై రవి భార్య సంచలన వ్యాఖ్యలు
  4. లాస్యకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రవి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -