Monday, April 29, 2024
- Advertisement -

వర్షిణి భర్తపై యాంకర్ రవి షాకింగ్ కామెంట్స్..?

- Advertisement -

బుల్లితెర యాంకర్ గా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్న మేల్ యాంకర్లలో యాంకర్ రవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బుల్లితెరపై వివిధ కార్యక్రమాలకు యాంకర్ గా విధులు నిర్వహిస్తూ ఎంతో సందడి చేస్తుంటారు. దాదాపు పది సంవత్సరాల తన కెరీర్లో ఎన్నో కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించిన పటాస్ కార్యక్రమం మాత్రం రవికి మంచి గుర్తింపును సంపాదించింది.

యాంకర్ గా ఎంతో బిజీగా గడుపుతున్న రవి సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలోని”మగువా మగువా”అనే పాటకు మేల్ వెర్షన్‌గా ‘పురుషా పురుషా’ అనే పాటను చేశాడు. ఇందులో ఇంట్లోని పనులన్నీ తానే చేస్తున్నటువంటి ఒక వీడియోను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారడంతో సెలబ్రిటీల నుంచి సాధారణ అభిమానుల వరకు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు.

Also read:లాక్‌డౌన్‌ లో బిగ్ బాస్ షూటింగ్… సీల్ చేసిన పోలీసులు!

ఈ క్రమంలోనే యాంకర్ వర్షిని ‘అయ్యో మా రవన్నా ఏంటి ఇలా అయిపోయావ్? కానీ మస్త్ ఉంది చూడడానికి’ అంటూ ఫన్నీ కామెంట్ పెట్టగా అందుకు స్పందించిన రవి తనదైన రీతిలో సమాధానం చెబుతూ… సమాజంలో ప్రతి మగాడి పరిస్థితి ఇంతే కదా. రేపు పెళ్లి తర్వాత నీ మొగుడు కూడా ఇదే చేయాలి.. నువ్వు చేపిస్తావు అంటూ తనదైన రీతిలో కామెంట్ పెట్టాడు . ప్రస్తుతం యాంకర్ రవికి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:తుఫానులో సందడి చేసిన నటి… తిట్టిపోస్తున్న జనం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -