Saturday, May 18, 2024
- Advertisement -

ఎన్టీఆర్ తో సినిమాపై హింట్ ఇచ్చిన బుచ్చిబాబు..?

- Advertisement -

మెగా హీరో వైష్ణవ తేజ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఉప్పెన సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని సాధించిందో మనకు తెలిసిందే. దర్శకుడిగా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న బుచ్చిబాబుకు ప్రస్తుతం వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల నుంచి బుచ్చిబాబు దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నాడని వార్తలు జోరుగా వినిపించాయి.

ఎన్టీఆర్ బుచ్చిబాబు కాంబోలో సినిమా రాబోతుందని వార్తలు వినిపించినప్పటికీ ఇటు ఎన్టీఆర్ నుంచి కానీ.. అటు బుచ్చిబాబు నుంచి కానీ ఎలాంటి స్పందన లేదు. అయితే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా బుచ్చిబాబు చేసిన ట్వీట్ చూస్తే త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రానుందని చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది. ఇంతకీ డైరెక్టర్ బుచ్చిబాబు ఏమని ట్వీట్ చేశారంటే..

Also read:కరోనా వచ్చినప్పుడు వారే నాకు దైర్యం చెప్పారు: అనిల్ రావిపూడి

“నందమూరి తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.. ఎదురుచూస్తున్నాను సార్.. ట్రెండ్ సృష్టిద్దాం.. స్థానిక కథను ప్రపంచానికి తెలిసేలా చేద్దాం మీ ప్రేమ ఆప్యాయతలకు ధన్యవాదాలు” అంటూ ట్వీట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. దర్శకుడు బుచ్చిబాబు చేసిన ఈ ట్వీట్ చూస్తుంటే త్వరలోనే వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతోందని తెలుస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు చేసిన ట్వీట్ లో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

Also read:తుఫానులో సందడి చేసిన నటి… తిట్టిపోస్తున్న జనం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -