ప్రేమ ఇష్క్ కాదల్ లో హీరోయిన్ గా పరిచయమైన శ్రీముఖి ఆ తర్వాత కొన్ని సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో నటించి ఇటివలే ”పటాస్ ” అనే షోతో బాగా పాపులరైయింది యాంకర్ శ్రీముఖి. ఇటివకే రిలీజ్ అయిన జెంటిల్ మెన్ చిత్రంలో జర్నలిస్ట్ గా నటించింది. ఇప్పుడు “థాంక్ యూ మిత్రమా ” అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది.
అయితే తాజాగా లైవ్ చాట్ లో కనిపించిన శ్రీముఖి తన మనోగతాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ లైవ్ చాట్ లో చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. మీరు ఎవర్నైనా ప్రేమిస్తున్నారా? అని చాలా మంది వేసిన ప్రశ్న ఇది. దీనికి సమాధానం ఇచ్చిన శ్రీముఖి.. ‘అవును’ అని చెప్పింది. అయితే ఇక్కడ చిన్న మెలిక పెట్టింది. నేను ప్రేమిస్తుంది ఎవరినో కాదు.
ప్రస్తుతం నేను నటించిన “థాంక్ యూ మిత్రమా” షార్ట్ ఫిల్మ్ ని అని ముసిముసి నవ్వులు నవ్వింది శ్రీముఖి. ఆ తర్వాత కాసేపటికే నేను ప్రస్తుతం లవ్ లో లేను. పెళ్లి ఆలోచన కూడా ఇప్పట్లో లేదు ఐదేళ్ల తర్వాతనే పెళ్లి చేసుకుంటాను అని శ్రీముఖి చెప్పుకొచ్చింది.
{youtube}v=XSfRRRDPmS4{/youtube}
Related
