Monday, April 29, 2024
- Advertisement -

గూగుల్‌ వల్ల ఎన్టీఆర్ సీఎం అయ్యారు!

- Advertisement -

ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ నటిస్తోన్న జనతా గ్యారేజ్ సినిమా  పోస్ట్ పోన్ అయిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎందుకు పండగ చేసుకుంటున్నారు అనుకుంటున్నారా? గూగుల్ పుణ్య‌మా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఎన్టీఆర్ కు గూగుల్ కు సంబంధం ఏంటి అని షాక్ అవ్వొద్దు.

ఓ వైపు గ్యారేజ్ టీజ‌ర్ నాలుగు మిలియ‌న్ల వ్యూస్‌ను దాటేసి రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసుకుంటూ దూసుకుపోతోంది. గూగుల్ సంస్థ యంగ్ టైగర్ ను సీఎం చేసేసింది. అసలు సంగతి ఏంటంటే.. గూగుల్ కు ఉన్న ఫీచర్స్ లో గూగుల్ ట్రాన్స్ లేట‌ర్ ఒక‌టి. ఇందులో మ‌న మ్యాట‌ర్‌ను మ‌న‌కు కావాల్సిన ఏ భాష‌లోకి అయినా మార్చుకోవ‌చ్చు.

ఇందులో మనకు కావలసిన పదం టైప్ చేస్తే మనకు కావాల్సిన భాషలో దానికి అర్ధం వస్తోంది. అలా ఇంగ్లీష్ లో tarak అని టైప్ చేసి తెలుగులో అర్థం వెతికితే ‘ముఖ్యమంత్రి’ అని చూపిస్తోంది. దాంతో ఎన్టీఆర్‌ను గూగుల్ సీఎం చేసింది అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తెలుగు రాజ‌కీయాల్లో ఎన్టీఆర్ కీల‌క పాత్ర పోషిస్తార‌ని… ఖచ్చితంగా ఎన్టీఆర్ సీఎం అవుతారు అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్ప‌టి నుంచో అనుకుంటున్నారు. 2004, 2009 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ఎన్టీఆర్ ప్ర‌చారం చేసిన విషయం తెలిసిందే. గూగుల్ మంత్రం ఫ‌లించి తార‌క్ ఏనాటికైనా సీఎం అవుతారేమో. 

Related

  1. పవన్ బ‌ర్త్‌డే రోజు ఎన్టీఆర్ గిప్ట్!
  2. ఎన్టీఆర్ కెరీర్ లో అదిరిపోయే సినిమా జనతా గ్యారేజ్ – కొరటాల శివ
  3. బాలకృష్ణ కి భయపడిన ఎన్టీఆర్ ?
  4. ఎన్టీఆర్ గొప్పతనం ఇటీవలే బయట పడింది!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -