Thursday, March 28, 2024
- Advertisement -

యాంకర్ సుమపై ఫైర్.. నీకు క్రూరత్వం కనిపించడం లేదా అంటూ?

- Advertisement -

ఎంతో మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా కొన్ని వీడియోలను షేర్ చేస్తుంటారు. అయితే ఆ వీడియోలో కొందరు మంచిని గుర్తిస్తే మరికొందరు మాత్రం చెడును గుర్తిస్తూ ఉంటారు. మంచి కన్నా ఎక్కువగా చెడు కోసం వెతికేవారు ఎంతో మంది ఉంటారు. తాజాగా సుమ షేర్ చేసిన వీడియో పై నెటిజన్లు చెడును గుర్తించి ఆమెపై ఫైర్ అవుతున్నారు.

బుల్లితెరపై నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతున్న సుమ కనకాల ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ క్రమంలోనే పలు వీడియోలను షేర్ చేస్తూ ఎంతో సందడి చేస్తుంటారు. సాధారణంగా సుమ షేర్ చేసే వీడియోలలో నెగిటివిటీ కన్నా పాజిటివ్ అధికంగా ఉంటుంది. అయితే తాజాగా ఈమె షేర్ చేసిన వీడియోలో మాత్రం నెటిజన్లు తప్పులను వెతుకుతున్నారు.

సుమ షేర్ చేసిన వీడియోలో ఒక ఆవు లేగ దూడ ఉన్నాయి. ఆ దూడను సుమ రాముడు.. రాముడు అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ ఉంది. అయితే ఆ దూడ పట్ల సుమ చూపిస్తున్న ప్రేమను గుర్తించక దూడకు ఉన్న మాస్క్ ను చూపెడుతూ తన తల్లి దగ్గర పాలు తాగనివ్వకుండా ఈ క్రూరత్వం ఏమిటి అంటూ నెటిజన్లు ఆమెపై ఫైర్ అవుతున్నారు.. మరికొందరు మాత్రం దూడకు ఆ విధంగా ఎందుకు వేశారో వివరణ ఇస్తున్నారు. అది చాలా చిన్నది ఆ విధంగా వేయకపోతే స్థాయికి మించి పాలు త్రాగటం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రభాస్ పై శ్రుతి హసన్ కామెంట్..!

మరో పవర్‌ఫుల్‌ పాత్ర లో అనసూయ

మళ్ళీ ప్రేమలో పడిన గోవా బ్యూటీ..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -