Wednesday, May 8, 2024
- Advertisement -

ఎన్నో కష్టాలు ఎదిరించిన గొప్ప నటుడు పొట్టి వీరయ్య : చిరంజీవి

- Advertisement -

విఠలాచార్య సినిమాల్లో పొట్టి దెయ్యంగా కనిపిస్తూ కడుపుబ్బా నవ్వించిన పొట్టి వీరయ్య ఇక లేరు. దాదాపు 300 కి పైగా తెలుగు సినిమాల్లో కీలకమైన అతిథి పాత్రలను పోషించిన‌ ప్రముఖ తెలుగు నటుడు పొట్టి వీరయ్య హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. వీరయ్య మృతి పట్ల చిరంజీవి సంతాపాన్ని వ్యక్తం చేశారు.వృత్తి పరంగా, వ్యక్తిగతంగా వీరయ్య ఎన్నో సవాళ్లను అధిగమించారని తెలిపారు.

300కు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారని చెప్పారు. వీరయ్య మృతి తనను కలచివేసిందని తెలిపారు. ఆయ‌న‌ ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుడిని కోరుకొంటున్నాను అని అన్నారు. తెలంగాణలోని నల్గొండ జిల్లా, తిరుమలగిరి తాలూకా ఫణిగిరి గ్రామానికి చెందిన గట్టు వీరయ్య చిన్నప్పటి నుంచీ రంగస్థల క‌ళాకారుడు. సినీరంగంలో ద‌శాబ్ధాల పాటు ఆయ‌న సేవ‌లందించారు.

సినిమా వాళ్లే లేకపోతే నేను ఎప్పుడో చనిపోయే వాడిన‌ని.. చిరంజీవి గారు స్థాపించిన మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ వల్లే నేను ఈరోజు బతుకుతున్నా అని గతంలో ఓ ఇంట‌ర్వ్యూలో పొట్టి వీరయ్య వెల్ల‌డించారు.. సినిమాల్లో నటిస్తేనే డబ్బులు వస్తాయి.నేను అనారోగ్యంతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నానని తెలుసుకుని మెగాస్టార్ చిరంజీవి గారు రెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందించార‌ని ఆ ఇంటర్వ్యూలో పొట్టి వీరయ్య తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -