Wednesday, April 24, 2024
- Advertisement -

యాంకర్ సుమ పెద్ద అబద్ధాలకోరంట.. సుమపై దర్శకుడి కామెంట్స్!

- Advertisement -
anchor suma is a big liar vijayendra prasad

బుల్లితెరపై తిరుగులేని యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది యాంకర్ సుమ. ఇప్పుడు ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ సుమను అబద్ధాలకోరని అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన “శ్రీ వల్లి” సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమం నిన్న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు  సుమ హోస్ట్ గా వ్యవహరించారు. ఈ వేడుకపై విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ బాగా అబద్ధాలాడగలిగిన వ్యక్తి మంచి రచయిత అవుతాడని చెప్పారు.

తనలో అబద్ధాలాడగలిగిన నేర్పు ఉండడం వల్లే మంచి రచయితనయ్యానని తెలిపారు. ‘కథ అంటేనే ఓ అబద్ధం. ఎన్ని అబద్ధాలాడగలిగితే అన్ని గొప్ప కథలు రాయవచ్చు. యాభై ఏళ్లుగా నేను విజయవంతమైన రచయితగా కొనసాగుతున్నానంటే నేను ఎంత పెద్ద అబద్ధాలకోరునో అర్థం చేసుకోండి. రెండేళ్ల కిందట వారం వ్యవధిలో  ‘బాహుబలి’, ‘భజరంగీ భాయ్‌జాన్‌’ చిత్రాలు రిలీజ్ అయ్యి మంచి హిట్ అయినప్పుడు నాకంటే బాగా అబద్ధాలు ఆడగలిగేవారు లేరనుకున్నా.

కానీ, ఆ తర్వాతే తెలిసింది నా కంటే అందంగా అబద్ధాలు చెప్పే వ్యక్తి మరొకరున్నారని. ఆమె ఎవరో కాదు. యాంకర్‌ సుమ. ఆడియో వేడుకల్లో ఆమె బోలెడన్ని అబద్ధాలాడుతుంది. అతిథులందరినీ ‘ఇంద్రుడు.. చంద్రుడు’ అంటూ పొగుడుతుంది. సినిమా గురించి లేనిపోని అబద్ధాలు చెబుతుంద’ని అన్నారు. అయితే పక్కనే ఉన్న సుమ ఈ మాటలకు నవ్వుకున్నారు.

Related

  1. యాంకర్ సుమకి షాక్ ఇచ్చిన యంగ్ హీరో!
  2. రష్మీకి ప్రపోజ్ చేసిన సుమంత్!
  3. సుమకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పవన్!
  4. సుమ – ధోనీ సంభాషణ అదరహో

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -