Friday, May 3, 2024
- Advertisement -

యుద్ధం మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్

- Advertisement -
pawan kalyan warns govt for special status

మెరీనా బీచ్ వేదికగా.. కుల, మత తేడ లేకుండా ప్రతి ఒక్కరూ జల్లికట్టు కోసం పోరాడారు. ఇది చూసిన కేంద్రం దిగి వచ్చింది. తమిళనాడు ప్రభుత్వం పంపిన ఆర్డినెస్స్ ను కేంద్ర న్యాయశాఖ ఆమోదం కోసం పంపింది. ఇది విని తమిళనాడు ప్రజలు అనందంలో మునిగిపోయారు.

వాళ్ళు చేసిన ఉద్యమానికి ప్రతి ఒక్కరి మద్దతు ఉండటంతో తమ లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. వారు చేసిన పోరటానికి సోషల్ మీడియా లో కూడా ప్రతి ఒక్కరు మద్దతు పలికారు. ఇదంత ఏ రాజకీయ నాయకుడు లేకుండా వారు సాధించారు. అలాంటప్పుడు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం మనము చేయలేమా..? అందరూ దీనిపై మాట్లాడేవారేగానీ ఎవ్వరూ కూడా ఉద్యమానికి దిగలేదు. కానీ ఇప్పుడు చేసే ఉద్యమానికి జనసేన అదినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర యువతకి తోడుగా రంగంలోకి దిగారు.

జల్లికట్టు కోసం తమిళ ప్రజలు చేసిన పోరటం చూసి ఆంధ్రులు నేర్చుకోవాలి. జలికట్టు ఏపీ ప్రత్యేకహోదా అంశానికి స్ఫూర్తి అని, తమిళుల పోరాటం తనని ఎంతగానో కదలించిందని పవన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలని అవమానిస్తే ఇలాంటివి జరుగుతాయని పవన్ అన్నారు. లక్షలాది మంది మెరీనా బీచ్ దగ్గర ఉద్యమించిన ఎటువంటి అసాంఘిక చర్యలు చోటుచేసుకాకపోవడం సంతోషకరం అని తెలిపారు. మనం కూడా ఇలాంటిది చేయాలని.. రాజకీయ నేతలు రాజీపడ్డా ప్రజలు మాత్రం రాజీపడదు అని అన్నారు. ఈ మాటలు చూస్తే.. త్వరలోనే ప్రత్యేక హోదా పై పోరు మొదలైన ఆశ్చర్యపోనవసరం లేదు.

Related

  1. దేశ్ బచావ్ పేరుతో పవన్ ఆల్బమ్!
  2. పవన్ పొలిటిక‌ల్ కేరీర్‌ నడిపిస్తున్న దర్శకుడు ఎవరో తెలుసా..?
  3. అన్నయ్యను ఇంటికి వెళ్లిన పవన్.. ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు!
  4. నాగబాబు, పవన్ ల గురించి నిజాలు చెప్పిన చిరు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -