Sunday, May 12, 2024
- Advertisement -

అమ్మో.. సుమ అంత పని చేసిందా?

- Advertisement -

ప్రతి రోజు ఏదో ఒక టీవి షోతో కనిపిస్తూ ఉంటుంది యాంకర్ సుమ. సుమ అంటే తెలియాని వారు ఉండరు. అంతలా పేరు సంపాదించుకుంది సుమ. యాంకర్‍గా టాప్ ప్లేస్ లో సుమ కొనసాగుతూ అందరిని ఎంటర్‍టైన్ చేస్తోంది. అనర్గళంగా మాట్లాడుతూ పార్టిసిపెంట్స్‌కు ఛాన్స్ ఇవ్వకుండా నిత్యం అందరినీ నవ్విస్తూ ప్రశంసలను అందుకుంటున్న ఏకైక యాంకర్ సుమ.

అయితే సుమ కొన్ని సినిమాలు చేసినప్పటికి ఎక్కువగా టీవి షో లతోనే అలరిస్తుంది. అయితే టీవీ షోస్ మాత్రమే కాకుండా సినిమాలకు సంబంధించి ఆడియో వేడుకలో కూడా తన సత్తా చాటుతుంది. ఏవరినైన అదిరిపోయే ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చెయడంలో సుమ దిట్ట. అయితే సుమలో కేవలం యాంకరింగ్ ట్యాలెంట్ మాత్రమే లేదండోయ్. తాను మల్టీట్యాలెంటెడ్ అని నిరూపించుకోవడానికి రెడీ అయ్యింది. ఇంతకి సుమ ఏం చేయబోతుందో తెలుసా? ఓ టీవీ ప్రోగ్రామ్ కి సంబంధించిన పాటను పాడుతోంది.

తన లో దాగి ఉన్న సింగర్ ను బయటకు తీస్తోంది. తనకు ఈ చాన్స్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందట సుమ. మాటీవీ రూపొందిస్తున్న సెల్ మీ ద ఆన్స‌ర్ అనే న్యూ గేమ్ షో కోసం సుమ పాట పాడింది. ర‌వికాంత్ రాసిన పాట‌ను సుమ పాడ‌గా సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచె నేతృత్వంలో రికార్డ్ చేసారు. సుమ మొదటి సారిగా పాట పాడిందని మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.

Related

  1. కోటి రూపయల కార్ ని కొన్న హాట్ యాంకర్
  2. రేష్మి అడ్డంగా మోసపోయిందా?
  3. ఇంటికి వస్తే స్వర్గం చూపిస్తానంటున్న రేష్మి!
  4. నాగార్జున చేసిన పనికి బాధపడుతున్న అనసూయ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -