Saturday, May 25, 2024
- Advertisement -

స్టార్ హీరోల రెమ్యున‌రేష‌న్లు ఇవే!

- Advertisement -

ప్రస్తుతం స్టార్ హీరోలు ఇమేజ్ తగ్గట్లే నిర్మాత‌లు కూడా భారీ సినిమాలు నిర్మిస్తూ భారీగా కలెక్షన్స్ వసుల్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో స్టార్ హీరోలు రెమ్యున‌రేష‌న్ కూడా ఓ రేంజ్‌లో తీసుకుంటున్నారు. ఓ స్టార్ హీరో సినిమా తీస్తున్నాడు అంటే అతనికి ఆ సినిమాకు జరిగే వ్యాపారం నుంచి ఆ సినిమా హీరోకు 15 నుంచి 20 శాతం పారితోషికంగా ఇస్తారు. కానీ ఇది గతంలో ఇప్పుడు పద్దతి మారింది. సినిమా బిజినెస్ గ‌తంలో కంటే ఇప్పుడు భారీగా పెరిగిపోయింది.

శాటిలైట్‌, డబ్బింగ్‌ అమ్మాకల వల్ల నిర్మాతలకు భారీగా డబ్బులు వస్తున్నాయి. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోలుగా ఉన్న ప‌వ‌న్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్ రెమ్యున‌రేష‌న్ల గురించి ఇండ‌స్ర్టీలో ఇంట్ర‌స్టింగ్ న్యూస్ కొద్ది రోజులుగా చ‌క్కెర్లు కొడుతోంది. ఫిల్మ్‌న‌గ‌ర్ స‌మాచారం ప్ర‌కారం సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమా కోసం పవన్‌కళ్యాణ్ 32 కోట్లు, బ్రహ్మోత్సవం కోసం మహేష్‌బాబు 22 కోట్లు, జనతా గ్యారేజి కోసం జూనియ‌ర్ ఎన్టీఆర్‌ 18 కోట్లు పారితోషికం తీసుకున్నారట. పవన్ ఒక్కో చిత్రం కోసం రూ.22 కోట్లు వ‌ర‌కు తీసుకుంటాడ‌ట‌.

ఇక మ‌హేష్‌బాబు శ్రీమంతుడు, బ్ర‌హ్మోత్స‌వం సినిమాల్లో భాగ‌స్వామిగా కూడా ఉన్నాడు. దీంతో ఈ రెండు సినిమాల‌కు మ‌హేష్‌కు రూ.22 కోట్లు వ‌ర‌కు ముట్టిన‌ట్టు తెలుస్తోంది. టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో రెంటు హిట్ అవ్వ‌డంతో గ్యారేజ్‌కు రూ.18 కోట్లు తీసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. సో మొత్తానికి టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యున‌రేష‌న్ భారీగానే పెరిగిన‌ట్టు ఈ లెక్క‌ల ద్వారా స్ప‌ష్ట‌మ‌వుతోంది.

Related

  1. ఎన్టీఆర్ డెడికేషన్ చూసి కొరటాల షాక్!
  2. ఆ హీరోయిన్ కి దెబ్బ కొట్టిన పవన్‌, మహేష్‌!
  3. ఇండైరెక్ట్ గా సహాయం చేసిన పవర్ స్టార్!
  4. పవర్ స్టార్ ఫ్యాన్స్ vs స్టైలీష్ స్టార్ ఫ్యాన్స్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -