Saturday, April 27, 2024
- Advertisement -

అనిల్ రావిపూడి కి ఏ దిక్కు లేకనే ఈ సినిమా చేస్తున్నాడా..

- Advertisement -

కమర్షియల్ సినిమాల్లో కామెడీ ని జోడించి హిట్ సినిమాలు చేసిన దర్శకులు టాలీవుడ్ లో కొంతమందే ఉన్నారని చెప్పొచ్చు..ఆలా  టాలీవుడ్ కి దొరికిన అతి కొద్దీ మంది దర్శకుల్లో ఒకరు అనిల్ రావిపూడి.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పటాస్ సినిమా హిట్ రావడంతోనే టాలీవుడ్ కి ఓ మేలిమి డైరెక్టర్ దొరికిపోయాడని అర్థమైపోయింది.. తొలి సినిమా తోనే హిట్ కొట్టిన అనిల్ ఆ తర్వాత వరుసగా మూడు హిట్ లు కొట్టి టాప్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాడు..

రాజా ది గ్రేట్, F2 , సరిలేరు నీకెవ్వరూ వంటి చిత్రాలతో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా పెద్ద పెద్ద హీరోలతో సినిమా చేస్తాడని మంచి కితాబు కూడా దక్కించుకున్నాడు.. ఇప్పుడు F3 మీద వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది.. రవితేజ వెంకీ, వరుణ్ లతో జాయిన్ కాబోతున్నాడని ప్రచారం జరుగుతుంది.. అయితే ఇప్పుడు సడెన్ గా ఈ ప్రాజెక్ట్ ని పక్కనపెట్టి అనిల్ రావిపూడి ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయబోతున్నట్లు వార్త బయటికి వచ్చింది..

వెంకటేష్-వరుణ్ తేజ్ ల మల్టీ స్టారర్ ఎఫ్2 సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా ఉంటుందని నిర్మాత దిల్ రాజు చాలా కాలం క్రితమే ప్రకటించారు. దానికి తగ్గట్టే దర్శకుడు అనిల్ రావిపూడి స్క్రిప్ట్ పనులు కూడా వేగవంతం చేశాడు. అయితే అనూహ్యంగా లాక్ డౌన్ వచ్చి అందరి ప్లానింగ్స్ తలకిందులయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎఫ్3 ని లాంచ్ చేసే అవకాశాలు తగ్గిపోయాయి. ఎఫ్3కు క్యాస్టింగ్ కూడా భారీగా అవసరం ఉండటంతో కొన్నాళ్ళు పెండింగ్ లో ఉంచడమే మంచిదని నిర్ణయించుకున్నారట. దాంతో టైం వెస్ట్ చేయడం ఇష్టం లేని అనిల్ రావిపూడి సాయి పల్లవి తో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి ప్లాన్ చేశాడని తెలుస్తుంది.. అలాగే నాగార్జున తో సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి..ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఏంటో తెలియాలంటే అనిల్ వచ్చి చెప్పేంతవరకు ఆగాల్సిందే..

పుష్ప సినిమా షూటింగ్ పై ఇంకా వీడని సందేహం..

హిట్ డైరెక్టర్ కి హీరో లేడేంటి.. ఆయనకు ఏంటి దుస్థితి..?

బాలుగారికి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

రవితేజ నక్కిన ని పక్కన పెట్టాడా.. ఇప్పుడెలా.?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -