Friday, April 19, 2024
- Advertisement -

అనిల్ రావిపూడి దర్శకత్వంలో సునీల్..?

- Advertisement -

హీరో సునీల్ పరిస్థితి ఎలా తయారైందో అందరికి తెలిసిందే.. తొలుత కమెడియన్ గా కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు హీరో గా మారి కొన్ని సినిమాలు హిట్ కొట్టినా ఆ తర్వాత అన్ని ఫ్లాప్ సినిమాలు చేసి దారుణమైన ఇమేజ్ ని మూటగట్టుకున్నాడు.. ఇప్పుడు హీరో గా, కమెడియన్ గా రెండు విధాలుగా సునీల్ కి చేతిలో పెద్దగా సినిమాలు లేవని చెప్పాలి.. ఇక తాజాగా సునీల్ కి ఓ బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది.. అనిల్ రావిపూడి చేయబోయే F3 సినిమాలో సునీల్ నటించబోతున్నాడట..

కమర్షియల్ సినిమాల్లో కామెడీ ని జోడించి హిట్ సినిమాలు చేసిన దర్శకులు టాలీవుడ్ లో కొంతమందే ఉన్నారని చెప్పొచ్చు..ఆలా  టాలీవుడ్ కి దొరికిన అతి కొద్దీ మంది దర్శకుల్లో ఒకరు అనిల్ రావిపూడి.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన పటాస్ సినిమా హిట్ రావడంతోనే టాలీవుడ్ కి ఓ మేలిమి డైరెక్టర్ దొరికిపోయాడని అర్థమైపోయింది.. తొలి సినిమా తోనే హిట్ కొట్టిన అనిల్ ఆ తర్వాత వరుసగా మూడు హిట్ లు కొట్టి టాప్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాడు..

రాజా ది గ్రేట్, F2 , సరిలేరు నీకెవ్వరూ వంటి చిత్రాలతో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడమే కాకుండా పెద్ద పెద్ద హీరోలతో సినిమా చేస్తాడని మంచి కితాబు కూడా దక్కించుకున్నాడు.. ఇప్పుడు F3 మీద వర్క్ చేస్తున్నాడని తెలుస్తుంది.. రవితేజ వెంకీ, వరుణ్ లతో జాయిన్ కాబోతున్నాడని ప్రచారం జరుగుతుంది..  రవితేజ తో పాటు సునీల్ కూడా ఈ సినిమా లో ఉండబోతున్నది తెలుస్తుంది.  ఎఫ్ 2 లో రాజేంద్ర ప్రసాద్ పోషించినటువంటి ఒక మంచి కామెడీ రోల్ ను సునీల్ తో చేయించాలని దర్శకుడు అనీల్ రావిపూడి భావించాడట. ఆ పాత్ర కమెడియన్ కు ఎక్కువ హీరోకు తక్కువ అన్నట్లుగా ఉంటుందట. ఈమద్య కాలంలో సునీల్ కు తన ప్రతిభ చూపించేందుకు సరైన ఛాన్స్ దక్కడం లేదు. కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు అయిన అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 3 లో నటిస్తే సునీల్ మళ్లీ బిజీ అవ్వడం ఖాయం అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. 

‘సర్కార్ వారి పాట’ యాక్షన్ ప్లాన్ చేంజ్.. ఎందుకు..?

సునీల్ తో రాజ్ తరుణ్.. హీరో గా కాదా..?

కీరవాణి కొడుకు లైన్ లోకి వచ్చేస్తున్నది..?

విజయ్ కి త్రుటిలో జారిన రికార్డు..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -