పూజా హెగ్డే గురించి మనకు తెలియని కొన్ని విషయాలు

- Advertisement -

ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాధే శ్యామ్’ అలానే అఖిల్ హీరోగా తెరకెక్కుతోన్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాల్లో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తోంది. ఇవే కాకుండా బాలీవుడ్లో కూడా వరుస ఆఫర్లు అందుకుంటూ దూసుకుపోతుంది. ఈరోజు ఈ ‘బుట్ట బొమ్మ’ పుట్టినరోజు. కాబట్టి ఈమె గురించి మనకు తెలియని విషయాలు చూద్దాం.

  • పూజా హెగ్డే పుట్టి, పెరిగింది అంతా ముంబైలోనే.
  • పూజా మిస్‌ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది. తర్వాత మోడలింగ్‌ చేసే అవకాశాలు కూడా వచ్చాయట. తర్వాత సినిమాల్లో ఛాన్స్ వచ్చింది. పూజా హెగ్డే మొదట ‘ముగామూడీ’ అనే తమిళ సినిమాలో చేసింది. ఆ తర్వాత తెలుగులో ‘ఒక లైలా కోసం’ చిత్రంలో నటిచింది. ఆ తర్వాత హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కిన ‘మహోంజదారో’ చిత్రంలో పూజకు ఛాన్స్ దక్కింది.
  • పూజా హెగ్డేకు ఆమె తల్లి ఎంకరేజ్మెంట్ ఎంతో ఉందని ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.
  • ‘మహోంజదారో’ భారీ బడ్జెట్ సినిమా కాబట్టి ఈమె 2ఏళ్ళు డేట్స్ ఇచ్చిందట. ఈ కారణంగా మరో సినిమా చెయ్యలేకపోయిందట.అయితే ఈమె చేసిన సినిమాలు మంచి ఫలితాన్ని ఇవ్వలేదు కాబట్టి.. ఈమెకు అవకాశాలు రాలేదని మొదట అందరూ కామెంట్స్ చేసేవారట. అయినా ఈమె బాధపడలేదు.ఫలితంగా వరుసగా పెద్ద సినిమాలు చేసే అవకాశాన్ని దక్కించుకుంది.
  • ‘రంగస్థలం’ మూవీలో ‘జిగేలు రాణి’ వంటి ఐటెం సాంగ్ కు ప్రాముఖ్యత ఉంది కాబట్టే.. . ఆ పాటలో పూజా నర్తించడానికి ఒప్పుకుందట.
  • డైటింగ్ వంటివి చెయ్యడం కూడా పూజకు నచ్చవట. అయితే కొవ్వు పట్టేసే పదార్ధాలకు మాత్రం దూరంగా ఉంటుంది.ఎక్కువగా ప్రోటీన్స్ ఉన్న పదార్ధాలను కూడా తీసుకుంటూ ఉంటుంది పూజా.
  • కథ డిమాండ్ చేస్తేనే గ్లామర్ రోల్స్ చేయడానికి రెడీనట. అనవసరంగా గ్లామర్ షో చేయదట.
  • హీరోయిన్ ఓరియెంటెడ్‌ సినిమాలు అయితే చెయ్యదట పూజా హెగ్డే. అలాంటి సీరియస్ రోల్స్ చెయ్యడం అస్సలు ఇష్టం ఉండదట.

‘సర్కార్ వారి పాట’ యాక్షన్ ప్లాన్ చేంజ్.. ఎందుకు..?

- Advertisement -

జూ ఎన్టీఆర్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా ?

అనసూయ ఆస్తి ఎన్ని కోట్లో తెలుసా ?

కీరవాణి కొడుకు లైన్ లోకి వచ్చేస్తున్నది..?

Related Articles

- Advertisement -

Most Read

- Advertisement -