Thursday, April 25, 2024
- Advertisement -

విజయ్ కి త్రుటిలో జారిన రికార్డు..?

- Advertisement -

గతంలో హీరోలందరూ సంవత్సరానికి పది పదిహేను సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఎంతో అలరిస్తూ ఉండేవారు.. కానీ వస్తూ వస్తూ హీరోలు సినిమాలు చేయడం చాలా తగ్గించేశారు.. ఇప్పుడు సంవత్సరానికి ఒక్క సినిమా చేయడమే పెద్ద విషయం అయిపొయింది.. ప్రేక్షకుల్లో హీరో లపై అంచనాలు పెరిగిపోవడం, సినిమాలో క్వాలిటీ ని కోరుకోవడంతో అందుకోసమే లేట్ గా సినిమా ప్రొడక్షన్ సాగుతుందని అంటున్నారు.. తెలుగు హీరోల్లో ఇలా సంవత్సరానికి సినిమా చేయడం కాదు కదా ఒకానొక సమయంలో రెండు మూడు సంవత్సరాలు గ్యాప్ కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి..

వరస డిజాస్టర్లు పలకరించినప్పుడు మెగాస్టార్ 1996లో ఏ సినిమా విడుదల చేసుకోలేదు. అల్లు అర్జున్ నా పేరు సూర్య దెబ్బకు, నితిన్ శ్రీనివాస కళ్యాణం తర్వాత ఇలా బ్రేక్ తీసుకున్న వాళ్ళే. మహేష్ బాబు ఖలేజాకు ముందు సీన్ అందరికీ గుర్తే. ఇక పవన్ కళ్యాణ్ సంగతి సరేసరి. పక్క రాష్ట్రంలో వీళ్లకు ఏ మాత్రం తీసిపోని ట్రాక్ రికార్డు ఉన్న తమిళ హీరో విజయ్ 1992 నుంచి 2019 దాకా నాన్ స్టాప్ గా ఒక్క సంవత్సరం గ్యాప్ రాకుండా సినిమాలు విడుదల చేసుకున్నారంటే ఆశ్చర్యం కలగక మానదు. కానీ ఇది నిజం.

27 ఏళ్లుగా నిర్విరామంగా సినిమాలు చేసి విజయ్ ప్రేక్షకులను ముఖ్యంగా తన అభిమానులను ఎంతగానో అలరించి త్వరలోనే ఓ రికార్డు సృష్టించబోతున్నాడనే టైం రాగానే అది తృటిలో చేజారిపోతుందనే బాధ ఇప్పుడు అభిమానుల్లో ఉందట..మాస్టర్ ని పూర్తిగా పోస్ట్ పోన్ చేశారు. వచ్చే సంక్రాంతికి వస్తుందా లేక 2021 వేసవికి వెళ్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ విషయంగా విజయ్ ఫ్యాన్స్ తెగబాధ పడిపోతున్నారు. నిజమే మరి. వందల కోట్ల మార్కెట్ ఉన్న హీరోకు ఇలాంటి అరుదైన రికార్డు మిస్ అయితే ఆ మాత్రం పెయిన్ అనిపించడం సహజం. కార్తీక్ ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ లో విజయ్ సేతుపతి విలన్ గా నటించడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.

పుష్ప సినిమా షూటింగ్ పై ఇంకా వీడని సందేహం.

మళ్ళీ త్రివిక్రమ్ ఆమెనే తీసుకుంటున్నాడా..?

బాబోయ్ దసరా కి మా సినిమాలను రిలీజ్ చేయం..?

రవితేజ పరిచయం చేసిన దర్శకులు వీరే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -